Viral Video: పెళ్లి వేదికపై వధువు తుంటరి పనికి.. వరుడి వింత రియాక్షన్ చూసి.. అవాక్కైన అతిథులు..
ABN, Publish Date - Feb 18 , 2024 | 05:35 PM
పెళ్లిళ్లలో కొందరి అల్లరి అంతా ఇంతా కాదు. కొన్నిసార్లు స్నేహితులంతా కలిసి వధూవరులను ఆటపట్టిస్తుంటారు. అలాగే మరికొన్నిసార్లు వధువును వరుడు, వరుడిని వధువు కూడా ఆట పట్టిస్తుంటుంది. అయితే...
పెళ్లిళ్లలో కొందరి అల్లరి అంతా ఇంతా కాదు. కొన్నిసార్లు స్నేహితులంతా కలిసి వధూవరులను ఆటపట్టిస్తుంటారు. అలాగే మరికొన్నిసార్లు వధువును వరుడు, వరుడిని వధువు కూడా ఆట పట్టిస్తుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తమషా కాస్తా చివరకు సీరియస్‌గా మారే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వధూవరుల మధ్య చోటు చేసుకున్న తమాషా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేదికపై వధువు చేసిన తుంటరి పనికి చివరకు వరుడు సీరియస్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్ల పగలబడి నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు (bride and groom) వేదికపై దండలు మార్చుకుంటుంటారు. పక్కన బంధువులంతా ఆసక్తిగా చూస్తుంటారు. మరోవైపు ఫొటోగ్రాఫర్లు.. వధూవరులను వివిధ యాంగిల్స్‌లో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా దండలు మార్చుకునే సమయంలో (Bride and groom exchanging wreaths) వధూవరులు తమదే పైచేయి కావాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ముందుగా వరుడి మెడలో వధువు దండ వేసేందుకు ప్రయత్నిస్తుంది. వరుడు కూడా ఎలాంటి ఇగోలకు పోకుండా దండ వేయించుకుంటాడు.
దీంతో పక్కన ఉన్న అతిథులంతా చప్పట్లు కొడతారు. తర్వాత వరుడి వంతు వస్తుంది. వధువు మెడలో దండ వేయాలని చూడగా.. ఆమె వెనక్కు జరుగుతుంది. దీంతో కాసేపు నవ్వుకుని మళ్లీ దండ వేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే వధువు మళ్లీ వెనక్కు జరుగుతుంది. దీంతో పక్కన ఉన్న వారంతా నవ్వుకుంటారు. వధువు తమాషాకు చేసినా వరుడు దాన్ని సీరియస్‌గా తీసుకుంటాడు. ‘‘ఎహే.. నాకు ఈ పెళ్లి వద్దూ.. ఏమీ వద్దు.. నేను వెళ్లిపోతున్నా’’.. అన్నట్లుగా ఆగ్రహంతో దండను వధువుపై విసిరికొట్టి, అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అప్పటిదాకా సందడిగా ఉన్న వాతావరణం కాస్తా.. ఒక్కసారిగా సీరియస్‌గా మారుతుంది. వరుడి అనూహ్య ప్రవర్తన చూసి అతిథులంతా అవాక్కవుతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Ex girlfriend: వారంలో మూడు రోజులు.. ప్రియుడికి వింత కండీషన్లు.. చివరకు జరిగింది ఇదీ..
Updated Date - Feb 18 , 2024 | 05:35 PM