ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: పాపం.. వధువు! నలుగురి ముందు వరుడు చేసిన పనికి..

ABN, Publish Date - Nov 01 , 2024 | 10:32 AM

వరుడి డ్యాన్స్ చూసి వధువు సిగ్గుతో ముణుచుకుపోయిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌‌గా మారింది. పెళ్లయ్యాక అతడితో ఎలా వేగుతుందో అంటూ జనాలు వీడియో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. ఆ రోజు వధూవరులకు సంబరం అంబరాన్ని అంటడం సాధారణమే. అయితే, ఈ సంతోషాన్ని వ్యక్తం చేసే తీరులో వధూవరుల మధ్య తేడాలు ఉంటాయి. కొందరు మొహమాటస్తులు తమ సంబరాన్ని నలుగురిలో బాహాటంగా వ్యక్తం పరచలేదు. మరికొందరు ఎంత మంది మధ్య ఉన్నా తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తారు. ఇలాంటి భిన్నస్వభావాలు కలిగిన వ్యక్తులు ఒక్కటైతే జరిగేదేంటో చెప్పే ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

Viral: అమెరికన్ పాప్ స్టార్‌ను ‘జై శ్రీరామ్’ అనాలని కోరిన భారతీయ అభిమాని!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తన పెళ్లి సందర్భంగా వరుడి సంబరం అంబరాన్ని అంటింది. వరమాల కార్యక్రమానికి ముందు (వధూవరులు దండలు మార్చుకోవడం) వధువు వేదికపైకి వచ్చింది. తన కోసం వస్తున్న ఆమెను చూడగానే వరుడి సంతోషం పీక్స్‌కు వెళ్లిపోయింది. దీంతో, అతడు నాట్యం చేయడం మొదలెట్టాడు. కానీ వధువుకు మొహమాటం ఎక్కువై అలా బిగుసుకుపోయింది. కనీసం నోటమాట కూడా రాలేదు. వరుడేమో వధువు ఇబ్బందిని అస్సలు పట్టించుకోకుండా తన డ్యాన్స్ కొనసాగించాడు. అంతేకాకుండా మెట్లెక్కబోతున్న ఆమెకు ఎదురుగా నిలబడి ఆమె చెంగును ఇద్దరి నెత్తినా కప్పుకుని డ్యాన్స్ చేశాడు. ఇది చూసిన వారు అతడు వధువును కిస్ చేయబోతున్నాడేమో అని అనుకుని బెంబేలు పడ్డారు. అయితే, వీడియో అక్కడితో ముగిసిపోవడంతో ఆ తరువాత ఏం జరిగిందీ తెలియరాలేదు.

Viral: ఈ ఆటోవాలా కోహినూర్ వజ్రం!


ఇక వీడియోలో ఇదంతా చూసిన జనాలు పడీ పడీ నవ్వుకుంటున్నారు. వధువు ఇబ్బందిని చూసి అనేక మంది ముచ్చట పడ్డారు. కొందరు ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. మా ఏరియాలో ఇలా చేస్తే వరుడు తన్నులు తింటాడని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. వరుడు దూకుడు మీదున్నాడు. వధువేమో మరీ సిగ్గరిలాగా ఉంది. మనోడితో ఆమె లైఫ్ ఎట్టానెట్టుకొస్తుందో అని ఓ వ్యక్తి సందేహం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

కాగా, గతంలో కూడా ఇలాంటి పెళ్లి వీడియోలు వైరల్ అయ్యాయి. కొన్నింటిల్లో వధూవరులు ఇద్దరూ డ్యాన్స్‌లు చేసి పెళ్లికొచ్చిన వారిని సర్‌ప్రైజ్ చేశారు. మరికొన్ని వీడియోల్లో వరుడి అతిచేష్టలు తట్టుకోలేక వధువు అతడి చెంప ఛెళ్లుమనిపించిన ఘటనలు కూడా వెలుగు చూశాయి.

Read Latest and Viral News

Updated Date - Nov 01 , 2024 | 10:39 AM