ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పెళ్లి వేడుకలో కాబోయే భార్యకు షాకిచ్చిన వరుడు.. ఆమె ఎందుకు కన్నీళ్లు పెట్టుకుందంటే..

ABN, Publish Date - May 11 , 2024 | 12:26 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతి ముఖ్యమైనది. ఆ వివాహ ఘట్టం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోవాలని వధూవరులు కోరుకుంటారు. తమకు ఆత్మీయులైన వారిని, స్నేహితులను, బంధువులను పెళ్లికి ఆహ్వానిస్తారు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంటారు.

wedding

పెళ్లి (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అతి ముఖ్యమైనది. ఆ వివాహ ఘట్టం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోవాలని వధూవరులు కోరుకుంటారు. తమకు ఆత్మీయులైన వారిని, స్నేహితులను, బంధువులను పెళ్లికి ఆహ్వానిస్తారు. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంటారు. ప్రస్తుతం ఓ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వరుడు (Groom) ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు వధువు (Bride) అందరి ఎదుటే కన్నీళ్లు పెట్టుకుంది (Viral Video).


goodnews_movement అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వివాహ వేడుక జరుగుతోంది. ఆ వివాహ వేడుకలో కనిపించిన అమ్మమ్మను (Grand Mother) చూసి వధువు కన్నీళ్లు పెట్టుకుంది. భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. వధువు అమ్మమ్మ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె వివాహ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని వధువు భావించింది. అయితే వరుడు తన కాబోయే భార్యకు తెలియకుండా ఆమె అమ్మమ్మను తీసుకొచ్చే ఏర్పాటు చేశాడు. కాబోయే భార్యను సర్‌ప్రైజ్ చేశాడు.


ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 67 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోలోని వరుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ``నాకూ కన్నీళ్లు వస్తున్నాయి``, ``ఆమ్మమ్మతో ఆమె బంధాన్ని అర్థం చేసుకున్నాడు``, ``గ్రేట్.. నిజమైన ప్రేమ అంటే ఇదే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Friendship Marriage: ఏమిటీ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్? జపాన్‌లో యువతీయువకుల కొత్త డేటింగ్ గురించి తెలుసా?


Puzzle: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోలో సుత్తి ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 11 , 2024 | 12:26 PM

Advertising
Advertising