Gujarat: కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడం ఇష్టం లేక వేళ్లు నరికేసుకున్న వ్యక్తి!
ABN, Publish Date - Dec 14 , 2024 | 09:43 PM
తన బంధువుకు చెందిన వజ్రాల కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడం ఇష్టంలేని ఓ వ్యక్తి తన చేతి వేళ్లను తనే కత్తితో నరికేసుకున్నాడు. ఈ ఉదంతం స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: అతడికి తన బంధువుకు చెందిన వజ్రాల కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడం ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తమ మనసులోని మాట స్పష్టంగా చెప్పి తప్పుకుంటారు. కానీ అతడు మాత్రం పని తప్పించుకునేందుకు ఏకంగా తన చేతి వేళ్లను తానే నరికేసుకున్నాడు. గుజరాత్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం స్థానికంగా కలకలానికి దారి తీస్తోంది (Viral).
Viral: ఏం క్రియేటివిటీ! ఇది ఆధార్ కార్డు అనుకుంటే పప్పులో కాలేసినట్టే..
పూర్తి వివరాల్లోకి వెళితే, మయూర్ తారాపరా (32) అనే వ్యక్తి తన చేతి వేళ్లు కోల్పోవడం వెనక పోలీసులకు ఓ కట్టుకథ వినిపించాడు. ఇటీవల ఓ రోజు రాత్రి బైక్‌పై వెళుతుండగా కళ్లు తిరిగినట్టు అనిపించిందని అన్నాడు. ఆ తరువాత రోడ్డుపై పడిపోయినట్టు చెప్పారు. మెళకువ వచ్చి చూస్తే తన ఎడమచేతి వేళ్లు కనిపించలేదని అన్నారు. దీంతో, ఎవరైనా క్షుద్రపూజల కోసం మయూర్‌ను టార్గెట్ చేసి ఉంటారని భావించారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీని జల్లెడపట్టగా అసలు బాగోతం బయటపడింది. మయూర్ స్వయంగా తన చేతి వేళ్లను తానే తెగ్గోసుకున్నట్టు తేలింది.
Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు
తొలుత మయూర్ ఘటనా స్థలంలో తన బైక్ పార్క్ చేశారు. ఆ తరువాత రాత్రి పది గంటల సమయంలో ఓ కొత్తితో తన చేతివేళ్లను తానే కట్టేసుకున్నాడు. రక్తస్రావం అడ్డుకునేందుకు మోచేతిపై గట్టిగా తాడుతోకట్టుకున్నాడు. కత్తిని, చేతి వేళ్లను ఓ బ్యాగులో వేసి మరోచోట పారేశాడు. ఆ తరువాత మయూర్ స్నేహితులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసుల గాలింపులో మయూర్ వేళ్లు, కత్తి ఉన్న బ్యాగు కూడా లభించింది. దీంతో, పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
Viral: వామ్మో.. ఈ అడల్ట్ డైపర్స్ ధర రూ.6 వేలు! ఎందుకో తెలిస్తే..
Viral: వామ్మో! టెస్లా రూపొందించిన ఈ మనిషి లాంటి రోబోను చూశారా..
Updated Date - Dec 14 , 2024 | 09:43 PM