Viral: మనిషంటే నువ్వే బాసూ! అచేతనంగా పడున్న పామును ఎలా కాపాడాడో చూడండి!
ABN, Publish Date - Oct 18 , 2024 | 07:24 PM
అచేతనంగా పడిఉన్న పామును ఓ వ్యక్తి సీపీఆర్ చేసి బతికించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. మానవత్వానికి ప్రతి రూపంగా నిలుస్తున్న అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మానవత్వానికి మించిన గొప్ప గుణం మరొకటి లేదు. ఇలాంటి వారు ఉన్న చోట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇందుకు తాజాగా ఉదాహరణ మరో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పాము అచేతనంగా పడి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ జంతు ప్రేమికుడు ఆ జీవిని కాపాడిన తీరుపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది (Viral).
Viral: ఆటోలో ఒంటరిగా మహిళ.. సడెన్‌గా ఓ వ్యక్తి లోపలికొచ్చి.. షాకింగ్ వీడియో!
గుజరాత్‌లోని వడోదరలో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివసించే యశ్ తాడ్వీ అనే జంతు ప్రేమికుడికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఓ పాము అచేతనంగా పడి ఉందన్నది దాని సారాంశం. వెంటనే అతడు అక్కడికెళ్లాడు.
అక్కడికి వెళ్లాక అతడికి పాము కనిపించింది. అది అచేతనంగా ఉంది. అయితే, పామును చూడగానే దాన్ని కాపాడే అవకాశం ఉందని అతడికి అనిపించింది. అది విషరహిత పాము కావడంతో అతడు వెంటనే దానికి సీపీఆర్ చేసేందుకు రంగంలోకి దిగాడు. మెల్లగా దాని నోరు తెరిచి నోట్లోకి గాలి ఊదాడు. ఇలా మూడు నిమిషాల పాటు సీపీఆర్ చేసినా దానిలో చలనం కనిపించలేదు. పాము చనిపోయిందని చుట్టుపక్కల వాళ్లు నిర్ధారించుకున్నారు. కానీ యశ్ మాత్రం పట్టువిడవకుండా మరోసారి ప్రయత్నించడంతో పాములో కదలిక కనిపించింది. ఆ తరువాత మరో రెండు సార్లు సీపీఆర్ చేయగానే అది పూర్తిగా స్పృహలోకి వచ్చింది. ఆ తరువాత పామును అతడు స్థానిక అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు.
Viral: రాధికా మర్చెంట్ బర్త్‌డే వేడుక.. వదిన కేక్ ఇస్తే వద్దన్న ఆకాశ్ అంబానీ!
మానవత్వానికి అసలైన ఉదాహరణగా నిలిచిన అతడి ప్రయత్నంపై స్థానికంగా ప్రశంసలు కురిసాయి. మీడియాలో కూడా అతడి వార్తలు ప్రముఖంగా వచ్చాయి. పాము బతికినందుకు యశ్ కూడా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నాకూ మొదట్లో అనుమానంగానే అనిపించింది. కానీ చివరి ప్రయత్నంగా దాన్ని బతికించేందుకు ట్రై చేశాను. అది బతికేసరికి నాకు పట్టలేని సంతోషం కలిగింది’’ అని అతడు చెప్పుకొచ్చాడు. కగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Updated Date - Oct 18 , 2024 | 07:30 PM