ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఈ తండ్రి పరిస్థితి చూస్తే గుండె జారిపోవాల్సిందే.. 3వ తరగతి చదువుతున్న కొడుకు కోసం..

ABN, Publish Date - Apr 11 , 2024 | 03:37 PM

మూడో తరగతి చదువుతున్న తన కుమారుడి స్కూల్ ఫీజు నెలకు రూ.30 వేలు అంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా అయితే బతికేదెలాగ అంటూ అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మూడవ తరగతిలో ఉన్న కొడుకును చదివించుకునేందుకు తానెంత ఖర్చు పెడుతున్నదీ చెబుతూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది. ఈ పోస్టుపై స్పందించిన అనేక మంది తల్లిదండ్రులు తామూ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నామని వాపోయారు. నేటి జమానాలో తల్లిదండ్రుల పరిస్థితులు తలుచుకుంటే కన్నీళ్లాగవంటూ అనేక మంది కామెంట్ చేశారు.

Viral: అప్పుడే పుట్టిన మనవడిని చూడగానే అత్తకు డౌట్.. కోడలికి బలవంతంగా డీఎన్‌ఏ టెస్టు చేయిస్తే..


గురుగ్రామ్‌కు (Gurugram) చెందిన ఉదిత్ భండారీ ఈ పోస్టు పెట్టారు. ఆయన కుమారుడు మూడో తరగతి చదువుతున్నాడు. ఇటీవల స్కూలు యాజమాన్యం అమాంతంగా ఫీజులు పెంచేయడాన్ని తట్టుకోలేక తన ఆవేదనను నెట్టింట పంచుకున్నాడు. ప్రస్తుతం తాను స్కూల్ ఫీజు నెలకు రూ.30 వేలు చొప్పున కడుతున్నానని చెప్పుకొచ్చాడు. ఈ మొత్తం సంవత్సరానికి 10 శాతం చొప్పున పెరుగుతోందని వాపోయాడు. చాలా సందర్భాల్లో కారణం లేకుండానే స్కూలు యాజమాన్యాలు ఫీజులు పెంచుతున్నాయని అన్నాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన కొడుకు పన్నెండవ తరగతికి వచ్చేసరికి ఫీజు రూ. 9 లక్షలకు చేరుకుంటుందని అన్నాడు. తల్లిదండ్రులు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మరో స్కూలు చూసుకోమని అంటున్నారని వాపోయారు (Gurugram man paying 30000 for sons Class 3 fees raises alarm).

Viral: గుండెలో దిగబడ్డ ఇనుపరాడ్డు.. అరుదైన సర్జరీతో రోగి ప్రాణాలను కాపాడిన వైద్యులు!


ఈ పోస్టు పలువురు తల్లిదండ్రులను కదిలించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని కొందరు అన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఈ ఫీజులు ఓ సవాలుగా మారాయని అన్నారు. కనీసావసరాలు తీర్చుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.

Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2024 | 03:40 PM

Advertising
Advertising