Viral Video: ప్రపంచానికి కావాల్సింది నీలాంటోళ్లే బ్రో..! బార్బర్ పనితో బుడ్డోడి ముఖం వెలిగిపోయిందిగా..!
ABN, Publish Date - Feb 26 , 2024 | 07:02 PM
అగ్ని ప్రమాదంలో జుట్టుంతా కోల్పోయిన బాలుడి లుక్ మొత్తం మార్చేసిన ఓ హెయిల్ స్టైలిస్ట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అగ్నిప్రమాదాల కారణంగా అనేక మంది అందవిహీనంగా మారతారు. తమ అందం కోల్పోయామన్న బాధతో తీవ్ర నిరాశలో కూరుకుపోతారు. అలాంటి ఓ బాలుడి జీవితాన్ని మలుపు తిప్పాడో హెయిర్ స్టైలిస్ట్ (Hairstylist). అతడిపై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ప్రపంచానికి నీలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉందంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు. జనాల్ని ఇంతలా కదిలించిన ఈ హెయిర్ స్టైలిస్ట్ పేరు ఫ్రాన్సిస్కో ఓలీవియేరా (Francisco Oliveira). అగ్నిప్రమాదాల కారణంగా జుట్టు కోల్పోయిన వారికి విగ్గులతో మునుపటి అందాన్ని తీసుకొచ్చే అతడు ప్రపంచమంతా పాప్యులర్. ప్రస్తుతం అతడి తాజా వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral video: ఎలా అడ్డంగా బుక్కయ్యాడో మీరే చూడండి.. సివిల్ డ్రెస్‌లో ఉన్నది ఐపీఎస్ అధికారని తెలీక..
వీడియోలోని చిన్నారి అగ్నిప్రమాద బాధితుడు (Fire Accident Victim). ఆ ప్రమాదంలో అతడు తన నెత్తిమీద జుట్టును చాలా వరకూ కోల్పోయాడు. పట్టుమని పన్నెండేళ్లు కూడా లేని అతడిలో తాను మిగతావారికంటే భిన్నంగా ఉన్నాన్న బాధ కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా తలపై టోపీ తీసినప్పుడు అతడి కళ్లల్లో బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఫ్రాన్సిస్కో ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా తన విగ్గును బాలుడికి చూపించి అతడిలో సంకోచం, బాధను తొలగించాడు. ఆ తరువాత అతడి నెత్తి మీద కూడా ఓ విగ్గు చాకచక్యంగా అమర్చాడు. అంతా పూర్తయ్యాక బాలుడి ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది (Incredible makeover of burn Victim). ముఖంలో ఆనందం పెల్లుబుకుతుండగా అతడు ఫ్రాన్సిస్కోను వాటేసుకున్నాడు.
Police Chase: ఐ20 కారును ఛేజ్ చేసిన పోలీసులు.. సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ ఉండదేమో! వైరల్ వీడియో!
ఈ వీడియో సహజంగానే నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు ఈ హెయిర్ స్టైలిస్ట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిన్నారి జీవితం మార్చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రముఖ బాలీవుడ్ నటి కొంకణ సేన్ శర్మ కూడా స్పందించింది. హార్ట్ ఎమోజీలతో తన మద్దతు తెలిపింది. ఇక వీడియో చూసిన జనాల ప్రశంసలకైతే అంతేలేకుండా పోయింది. మరి నెట్టింట ఇంతలా వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ ఓమారు చూడండి.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Feb 26 , 2024 | 07:11 PM