Viral Video: పరోటాతో సరికొత్త ప్రయోగం.. నెయ్యిలో వేయించి మరీ అందులో..
ABN, Publish Date - Jan 20 , 2024 | 06:18 PM
కొందరు కొత్త కొత్త రకం వంటకాలతో భోజన ప్రియులను ఆకట్టుకుంటుంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా లభించే ఆహార పదార్థాలు చూడగానే నోరూరించేలా ఉంటాయి. చాలా మంది...
కొందరు కొత్త కొత్త రకం వంటకాలతో భోజన ప్రియులను ఆకట్టుకుంటుంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా లభించే ఆహార పదార్థాలు చూడగానే నోరూరించేలా ఉంటాయి. చాలా మంది కొత్త కొత్త రెసిపీలతో వినూత్న వంటకాలను సిద్ధం చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఫుడ్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పరోటాను నెయ్యిలో వేయించి, అందులో హల్వా యాడ్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వావ్! సూపర్ కాంబినేషన్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో (Maharashtra Nagpur ) ఓ వ్యక్తి వినూత్నం రకం వంటకాన్ని సిద్ధం చేశాడు. ఇందుకోసం ముందుగా అతను చపాతీ పిండితో పెద్ద పరాటాను (Paratha) చేస్తాడు. దాన్ని నూనెకు బదులుగా నెయ్యిలో కరకరలాడేలా వేయిస్తాడు. తర్వాత పరోటాను ముక్కలుగా కట్ చేసి, అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న హల్వాను (Halva) అందులో యాడ్ చేసి ప్లేట్లో సిద్ధం చేస్తాడు.
Optical illusion: ఈ కొండల్లో చిరుత పులి ఎక్కడుందో పది సెకన్లలో గుర్తించగలరా..
హల్వా పరోటా అని పిలిచే ఈ వంటకానికి స్థానికంగా మంచి డిమాండ్ ఉంది. అక్కడికి కొత్త వాళ్లు ఎవరు వెళ్లినా విధిగా ఈ హల్వా పరోటాను రుచి చూస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చూస్తుంటేనే నోరూరుతోంది’’.. అంటూ కొందరు, ‘‘హల్వాతో పరోటా.. కాంబినేషన్ బాగుంది’’.. అంటూ మరికొందరు, ‘‘వామ్మో! ఇది హల్వా పరోటా కాదు.. హార్ట్ ఎటాక్ పరోటారా బాబోయ్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - Jan 20 , 2024 | 08:24 PM