ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వినోదం పంచాయి...

ABN, Publish Date - Dec 29 , 2024 | 07:28 AM

సినిమా వినోదానికి మనదగ్గర తిరుగులేదు. వసూళ్లు వందల కోట్ల రూపాయల నుంచి వేల కోట్లకు చేరుకున్నాయి. అయితే మంచి సినిమా ఎక్కడున్నా, ఏ భాషలో ఉన్నా వెదికి మరీ చూస్తారు మనవాళ్లు. ఈ ఏడాది ప్రేక్షకులు అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలివి...

సినిమా వినోదానికి మనదగ్గర తిరుగులేదు. వసూళ్లు వందల కోట్ల రూపాయల నుంచి వేల కోట్లకు చేరుకున్నాయి. అయితే మంచి సినిమా ఎక్కడున్నా, ఏ భాషలో ఉన్నా వెదికి మరీ చూస్తారు మనవాళ్లు. ఈ ఏడాది ప్రేక్షకులు అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలివి...

- భయపెట్టి మెప్పించింది!

ఆరేళ్ల క్రితం వచ్చిన ‘స్త్రీ’ ఆకట్టుకుంది. ఈ ఏడాది దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘స్త్రీ 2’ బ్లాక్‌ బస్టర్‌గా సత్తా చాటుకుంది. దర్శకుడు అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధాకపూర్‌, పంకజ్‌ త్రిపాఠీ, అభిషేక్‌ బెనర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక ఊరిలో గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేస్తుంటారు. ఇదే సమయంలో విక్కీ గ్యాంగ్‌ చేసిన సాహసమేంటీ? విక్కీ సాహసానికి తన ప్రేయసి ఎలా ఉపయోగపడిందనేది కథ. ఇందులోని ‘ఆజ్‌ కీ రాత్‌’ పాట ఇప్పటికీ చార్ట్‌బస్టర్‌లో నెంబర్‌ వన్‌గా కొనసాగుతోంది. ఈ చిన్న సినిమా రూ.884 కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డు క్రియేట్‌ చేసింది.


- అపజయం నుంచి...

టైటిల్‌తోనే కొన్ని చిత్రాలు ఆకర్షిస్తాయి. అలాంటి కోవలోకి చెందినదే ‘ట్వల్త్‌ ఫెయిల్‌’. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ జీవితం ఆధారంగా వచ్చిన పుస్తకమే ఈ సినిమాకి మూలం. విక్రాంత్‌ మాస్సే ప్రధాన పాత్రలో.. దర్శకుడు విధు వినోద్‌ చోప్రా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయిన కుర్రోడు ఆ తర్వాత బాగా చదువుకుని ఐపీఎస్‌ అవుతాడు. అతని జీవితంలోని కష్టాలు, ఆలోచనలు, మజిలీల సమాహారమే ఈ చిత్రం. సామాన్యుడు అసామాన్యమైన విజయం సాధిస్తే అందరికీ ఆశ్చర్యమే, అద్భుతమే. ఇలాంటి భావన ప్రేక్షకులకు కలిగింది కాబట్టి వసూళ్లతో పాటు అవార్డులనూ గెలుచుకుంది. విక్రాంత్‌ నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ సినిమా 2023 చివర్లో విడుదలైనప్పటికీ ఈ ఏడాది అనేక అవార్డులు గెలుచుకుని వార్తల్లో నిలిచింది.


- పితృస్వామ్య వ్యవస్థపై వ్యంగ్యాస్త్రం

స్టార్లు, బిల్డప్పులు లేకుండా సాదాసీదాగా ఉంటూ... సమాజంలో మహిళా స్వతంత్రం ఎలా ఉంటుందనే అంశంపై పితృస్వామ్య వ్యవస్థను వ్యంగంగా ఎండగట్టిన తీరు అమోఘం. ఆమిర్‌ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌రావ్‌ తెరకెక్కించిన ‘లాపతా లేడీస్‌’ చిన్న చిత్రమైనా మంచి గుర్తింపు పొందింది. ఇందులో కథే హీరో. పల్లెనుంచి వచ్చిన ఇద్దరు వధువులు తారుమారవుతారు. వారి అమాయకత్వం, నడుచుకునే తీరు.. చివరికి ఎవరకి వారు వాళ్ల భర్తల దగ్గరకు ఎలా చేరుకున్నారన్నదే ఇందులో కథాంశం. ఈ కామెడీ డ్రామాలో సోల్‌ ఉంది కాబట్టే ఆస్కార్‌ దాకా వెళ్లింది.


- చందమామ కథ

చందమామ కథలెప్పుడూ ఆహ్లాదంగా ఉంటాయి. వింతలోకంలోకి తీసుకెళ్తాయి. చెడుపై మంచి గెలిచే కాన్సెప్టు ‘హన్‌ మ్యాన్‌’. ఆంజనేయస్వామి అంటే బలం, తెగువకు ప్రతీక. ఆంజనేయుడి మీద పలు చిత్రాలు వచ్చినా ‘హనుమ్యాన్‌’ పంథా వేరు. ఓ సూపర్‌ పవర్‌ విలన్‌ను.. ఒక మారుమూల పల్లెటూరి లోని ఆంజనేయస్వామి భక్తుడు ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ కథాంశం. తేజా సజ్జా హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో పేరు తెచ్చు కుంది. అంజనాద్రి అనే ఊరు నేపథ్యం, రుధిరమణి, గ్రాఫిక్స్‌, పాటలు.. పిల్లలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ‘హనుమ్యాన్‌’ అందరికీ తెగ నచ్చాడు.


- స్త్రీ స్వేచ్ఛకై సాగిన పోరాటం...

స్వాతంత్ర్యానికి పూర్వం ‘హీరామండి’లో వేశ్యల జీవితం చూపించిన చిత్రమిది. చారిత్రక, రాజకీయాంశాలను చర్చించారు. ‘స్త్రీకి ఆస్తిలో వాటా ఇవ్వని సమాజం. చరిత్రలో ఎలా ఇస్తుంది?’ అనే సామాజిక కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకులు సంజయ్‌ లీలా భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షిసిన్హా, అదితీరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ బ్లాక్‌ షేడ్స్‌ వెబ్‌సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్స్‌ ఉన్నాయి. ‘జనాలకు పోరా డితే స్వాతంత్య్రం వస్తుంది. వేశ్యకు చనిపోతేనే స్వాతంత్య్రం వస్తుంది’ అనే డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది.


- త్రీ ఛీర్స్‌...

ఓటీటీలో విజయవంతమైన మరో సిరీస్‌ ‘మీర్జాపూర్‌ 3’. పంకజ్‌ త్రిపాఠీ, శ్వేత త్రిపాఠీ, అలీ ఫజల్‌, విజయ్‌ వర్మ, మాధురి యాదవ్‌ ప్రధాన పాత్రల్లో గుర్మీత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌ దర్శకత్వం వహించిన ‘మీర్జాపూర్‌ సీజన్‌ 3’ ఓటీటీలో దుమ్మురేపింది. అధికారం కోసం మనిషి ఏమైనా చేస్తాడనే కథే ఇది. ఆధిపత్య పోరు, పగలు, ప్రతీకారాలుండే గడ్డగా మీర్జాపూర్‌ వెబ్‌సిరీస్‌లన్నీ హిట్టే. ఇక మూడో సిరీస్‌లో శరద్‌ శుక్లా, గుడ్డూల మధ్య పోరు ఉంది. ద్వంద్వార్థాలు, హింస, రక్తపాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు విపరీతంగా సెర్చ్‌ చేసి మరీ చూశారు.

ఈ లిస్టులో ప్రభాస్‌ ‘కల్కి’, ‘సలార్‌’లతో పాటు ‘మంజుమల్‌ బాయ్స్‌’, విజయ్‌ ‘గోట్‌’, యేడాది చివర్లో వచ్చిన ‘పుష్ప 2’లు కూడా ఉండటం విశేషం.

Updated Date - Dec 29 , 2024 | 07:28 AM