ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కోడిపెట్టా మజాకా.. మొసళ్లకే చుక్కలు చూపించిందిగా..!

ABN, Publish Date - Oct 04 , 2024 | 06:59 PM

Wild Life: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో రకరకాల వీడియోలు ఉంటాయి. కొందరు వ్యక్తులు క్రియేట్ చేసే ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన నేచురల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో చాలా వరకు వీడియోలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తాయి.

Crocodile vs Hen

Wild Life: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో రకరకాల వీడియోలు ఉంటాయి. కొందరు వ్యక్తులు క్రియేట్ చేసే ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన నేచురల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో చాలా వరకు వీడియోలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తాయి. అలాంటి వీడియోలనే నెటిజన్లు తమ సన్నిహితులకు స్నేహితులకు షేర్ చేస్తుంటారు. అలా ఆ వీడియోలు ట్రెండింగ్‌లో నిలుస్తాయి. తాజాగా ఓ వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఓ కోడిపెట్ట మొసళ్లకు షాక్ ఇచ్చిన విధానం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అందకే ఆ కోడిని పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.


వైరల్ అవుతున్న వీడియోలో ఓ నీటి కుంట ఉంది. దాని నిండా మొసళ్లే ఉన్నాయి. ఆ మొసళ్లకు ఆహారంగా ఓ వ్యక్తి బ్రతికి ఉన్న కోడిని విసిరాడు. ఇంకేముంది.. ఆ కోడి మొసళ్లకు ఆహారమైపోతుందని చుట్టూ ఉన్న జనాలు భావించారు. కానీ, అందరి అంచనాలకు చిత్తు చేస్తూ.. తనను తిందామని ప్రయత్నించిన మొసళ్లకు గట్టి షాక్ ఇచ్చింది కోడి.


కేర్ టేకర్ మొదట కోడిని ఒక భారీ మొసలి ముందు విసిరారు. ఆ కోడిని లటుక్కున మింగేద్దామని ముందుకొచ్చింది మొసలి. కానీ, ఆ కోడి చిక్కకుండా తప్పించుకుంది. ఆ పక్కనే ఉన్న మొసళ్ల గుంపు.. కోడిని తినేందుకు పోటీ పడుతూ దూసుకొచ్చాయి. అయినా సరే వాటికి చిక్కితే ఒట్టు. మొసళ్లను తన్నుకుంటూ ఓరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్ అంటూ జంప్ అయ్యింది. నోటికాడికొచ్చిన కోడి.. చేజారిపోయిందే అన్నట్లుగా మొసళ్ల మంద బిక్క మొహం వేసుకుని అటూ ఇటూ దిక్కులు చూశాయి. కోడి మాత్రం ఆ గండం నుంచి బయటకొచ్చి బతికిపోయింది.


Also Read:

రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూడండి..

బాంబు బెదిరింపులతో ఇంజనీరింగ్ కాలేజీలు బెంబేలు

నవరాత్రులు మూడో రోజు.. విశేషమేమంటే..

For More Trending News and Telugu News..

Updated Date - Oct 04 , 2024 | 06:59 PM