ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: పదేళ్లుగా వీధుల్లో నివసిస్తున్న మహిళకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్!

ABN, Publish Date - Jul 22 , 2024 | 10:06 PM

కష్టాల్లో ఉన్న వారికి కాస్త సాయపడితే వచ్చే సంతృప్తి వెలకట్టలేనిది. అలాంటి అద్భుత అనుభవాన్ని సొంతం చేసుకున్నాడో అమెరికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. వీధుల్లో నివసించే ఓ మహిళకు అతడు ఏకంగా ఒక ఫ్లాట్‌నే బహుమతిగా ఇచ్చాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్‌ డెస్క్: కష్టాల్లో ఉన్న వారికి కాస్త సాయపడితే వచ్చే సంతృప్తి వెలకట్టలేనిది. అలాంటి అద్భుత అనుభవాన్ని సొంతం చేసుకున్నాడో అమెరికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. వీధుల్లో నివసించే ఓ మహిళకు అతడిచ్చిన బహుమతి తాలూకు ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. ప్రశంసల వర్షం కురుస్తోంది. నెటిజన్లు అమితంగా పొగుడుతున్న ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు ఇసాయా గార్జా.

Viral: మొసలికి బీపీ తెప్పిస్తే ఇలాగే ఉంటుంది! ఎర చిక్కలేదని తిక్కరేగడంతో..


స్వీటీ అనే మహిళ వీధుల్లో నివసిస్తుంటుంది. గత పదేళ్లుగా ఆమె ఇలాగే జీవిస్తోంది. ఇటీవల ఇసాయా ఆమెకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తొలుత అతడు ఆమె ఉంటున్న చోటుకు వెళ్లాడు. మహిళను పిలవగానే ఆమె సంబరపడిపోతూ వచ్చింది. ఆమెను చూడగానే నీకు ఓ సర్‌ప్రైజ్ ఇస్తున్నానని ఇసాయా చెప్పాడు. ఆమె చేతిలో ఓ పేపర్ బ్యాగు పెట్టాడు. అందులోని తాళాలు చూసి మొదట ఆమెకు ఏమీ అర్థం కాలేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ఆమెను చూస్తూ ఇసాయా నీకో అపార్ట్‌మెంట్‌ను ఉచితంగా ఇస్తున్నానని చెప్పాడు. కానీ ఆమె మాత్రం నమ్మలేదు (Homeless Womans Priceless Reaction To Receiving Her Own Apartment From US Influence).


ఈ క్రమంలో ఇసాయా ఆమె కళ్లకు గంతలు కట్టి ఓ ఫ్లాట్ వద్దకు తీసుకెళ్లాడు. లోపలికి వెళాక ఆమెకున్న గంతలు విప్పాడు. ఆ తరువాత మహిళ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కొనేళ్లుగా వీధుల్లో నివసిస్తున్న ఆమె తనకంటూ ఓ గూడు దొరికినందుకు కన్నీటి పర్యంతమైంది. ఇదంతా ఇసాయా వీడియోలో రికార్డు చేశాడు. నెట్టింట పంచుకున్నాడు. ఇక వీడియోలో మహిళ ఆనందం చూసి నెటిజన్లు కూడా తమకు కళ్లుచెమర్చాయని చెప్పుకొచ్చారు. ఇసాయా నిజంగా గొప్పపని చేశాడని అన్నారు. చేసిన మంచి చెప్పకూడదని అంటారు కానీ ఇతరులను మంచి దిశగా ప్రోత్సహించేందుకు ఇలా చేయడంలో తప్పేమీ లేదని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 22 , 2024 | 10:11 PM

Advertising
Advertising
<