Viral: సముద్రంలో వేట.. గెద్ద పవర్ అంటే ఇదీ! ఒళ్లుగగుర్పొడిచే వీడియో!
ABN, Publish Date - Jun 22 , 2024 | 04:57 PM
సముద్రంలోని చేపను సునాయసంగా వేటాడిన గెద్ద వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: గెద్ద.. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పక్షుల్లో ఇదీ ఒకటి. ఇవి వేటాడే తీరు చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మనుషులు గుర్తించలేనంత వేగంతో ఇవి వేటాడగలవు. నీళ్లల్లో లోతున ఉన్న చేపలను కూడా వందల అడుగుల ఎత్తున ఎగురుతూ గుర్తించి క్షణాల వ్యవధిలో వాటిని వేటాడేస్తాయి. అయితే, శక్తిమంతమైన కెమెరాలు అందుబాటులో వచ్చాక గెద్దల అసలు శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వచ్చి జనాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా (Viral) మారింది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.\
Viral: మహిళ సహనానికి పరీక్ష పెట్టిన ఉబెర్ డ్రైవర్! క్యాబ్ ఎక్కినప్పటి నుంచి..
ప్రముఖ వన్యప్రాణుల ఫొటో గ్రాఫర్ మార్క్ స్మిత్ ఈ అద్భుత దృశ్యాలను తన కెమెరాతో బంధించి ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఏకంగా 1.24 కోట్ల వ్యూస్ వచ్చాయి. వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. గాల్లో ఎగురుతున్న ఓ డేగ కింద సముద్రంలో లోతున ఉన్న ఓ చేపను గుర్తించింది. వెంటనే వేగంగా నీళ్లల్లోకి దూకి కాళ్లతో చేపను పట్టుకుంది. ఆ మరుక్షణం గెద్ద నీళ్లల్లో మునిగిపోకుండా రెక్కలను వేగంగా కదిలిస్తూ చేపను తీసుకుని గాల్లోకి ఎగిరింది. గాల్లో ఎగురుతూనే కాళ్లకున్న చేపను నోట కరిచి తినేసింది. క్షణకాలంలో జరిగిన ఈ వేట మొత్తాన్ని స్మిత్ రికార్డు చేసి స్లోమోషన్ వీడియోను నెట్టింట పంచుకున్నారు (Incredible close-up video of eagle catching fish is viral with 124 million views).
చేపను డేగ అత్యంత చాకచక్యంగా వేటాడిన తీరును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇక కెమెరామెన్ పనితీరుపై కూడా అనేక మంది ప్రశంసలు కురిపించారు. అరుదైన క్షణాల్ని అద్భుతంగా కెమెరాలో బంధించారంటూ కామెంట్స్ చేశారు. గెద్ద పవన్ అసాధారణమని అనేక మంది వ్యాఖ్యానించారు. చూస్తే నోటమాట రావట్లాదేని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
Updated Date - Jun 22 , 2024 | 04:57 PM