Viral: శ్వేతజాతీయురాలిని పెళ్లాడితే డైవర్స్ తప్పదన్నారు..ఎన్నారై వీడియో వైరల్
ABN, Publish Date - Nov 28 , 2024 | 09:56 PM
వివాహానికి ముందు తమకు ఎలాంటి హెచ్చరికలు వచ్చాయో చెబుతూ కెనడా యువతి, భారతీయ యువకుడు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ గ్లోబలైజేషన్ జమానాలో భిన్న జాతులు, సంస్కృతుల వారు పెళ్లి చేసుకోవడం అనేక సందర్భాల్లో చూసే ఉంటాం. అయితే, ఇలాంటి పెళ్లిళ్లకు సిద్ధపడే జంటలకు అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ఈ పెళ్లిళ్లు తగదని, ఒకరితో ఒకరు సర్దుకుపోవడం కష్టమని యువతియువకుల బంధువులు స్నేహితులు హెచ్చరిస్తుంటారు. అంతేకాదు, అవతలి వారి నేపథ్యం గురించి పూర్తిగా తెలీకపోయినా రకరకాల అపోహలను వ్యాపిస్తుంటారు. కెనడాలో ఉంటున్న ఓ ప్రేమ జంట కూడా సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. యువకుడు భారతీయుడైతే, యువతి కెనడాలో ఉంటున్న శ్వేతజాతీయురాలు. ఈ సంబంధం సరికాదంటూ పెళ్లికి ముందు తమకు ఎలాంటి హెచ్చరికలు వచ్చిందీ చెబుతూ వారు తాజాగా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.
Viral: యువతులతో కలిసి ఏనుగు భరతనాట్యం! జరిగింది తెలిస్తే కన్నీళ్లు ఆగవ్!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కెనడా యువతి డానియేల్ తనకు భారతీయుల విషయంలో ఎలాంటి హెచ్చరికలు వచ్చిందీ షేర్ చేసింది. భారతీయులకు ఇద్దరు భార్యలు ఉంటారని, వారు డియోడరెంట్ అసలే వాడరని, భారత్‌కు వెళితే అత్యాచారానికి గురికావాల్సి వస్తుందని భయపెట్టారని ఆమె చెప్పుకొచ్చింది. భారతీయుడిని పెళ్లాడబోతున్నానని తెలియగానే తనను ఇలా భయపెట్టే ప్రయత్నం చేశారని ఆమె పేర్కొంది.
మరోవైపు, భారతీయుడు ఏకాన్ష్ కూడా తనను దాదాపుగా ఇలాగే హెచ్చరించారని అన్నాడు. పాశ్చా్త్య యువతిని పెళ్లాడితే డైవర్స్ తప్పదని, విడాకుల తరువాత డబ్బు మొత్తం ఆమె తీసుకుని వెళ్లిపోతుందని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారు. అంతేకాకుండా, పాశ్చాత్యులు తమ తల్లిదండ్రులను కూడా సరిగా పట్టించుకోరని చెప్పినట్టు తెలిపాడు.
Viral: ఒక రూపాయి నాణెం ముద్రించేందుకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే..
ఇలా పెళ్లికి ముందు తమకెదురైన అనుభవాన్ని వారిద్దరూ నిర్మొహమాటంగా పంచుకోవడంతో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. శ్వేతజాతీయులతో పాటు భారతీయులు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. భారతీయుడిని పెళ్లాడేముందు తనకూ ఇలాంటి హెచ్చరికలే వచ్చాయని ఓ మహిళ చెప్పింది. గ్రీన్ కార్డు వచ్చాక అతడు విడాకులిచ్చేస్తాడని భయపెట్టారని, 17 ఏళ్లుగా మా బంధం సాఫీగా ఉందని చెప్పుకొచ్చింది. భారతీయులకు ఇద్దరు పెళ్లాలుంటారన్న ప్రచారం మాత్రం తానెప్పుడు వినలేదని చెప్పుకొచ్చింది. ఇద్దరు భార్యాల్ని సాకడం ఎవరి వల్లా కాదని ఓ వ్యక్తి సరదా కామెంట్ చేశాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Viral: రూ.6,015 కోట్లను చెత్తలో పారేసిన గర్ల్‌ఫ్రెండ్! జరిగిందేంటో తెలిస్తే..
Updated Date - Nov 28 , 2024 | 09:56 PM