Viral: ఇతడి తెలివికి పోలీసుల ప్రశంసలు! కుమారుడు అరెస్టయ్యాడని కాల్ వస్తే..
ABN, Publish Date - Jul 18 , 2024 | 04:39 PM
పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లకు మర్చిపోలేని షాకిచ్చిన ఓ ముంబై వాసిపై పోలీసులు ప్రశంసలు కురిపించారు. సైబర్ ఉచ్చులో పడకుండా ఉండేందుకు అవగాహనే శ్రీరామ రక్ష అని పోస్టు పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లకు మర్చిపోలేని షాకిచ్చిన ఓ ముంబై వాసిపై పోలీసులు ప్రశంసలు కురిపించారు. సైబర్ ఉచ్చులో పడకుండా ఉండేందుకు అవగాహనే శ్రీరామ రక్ష అని పోస్టు పెట్టారు. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఓ పాకిస్థాన్ నుంచి ఓ కాల్ వచ్చింది. కాలర్ ఐడీలో ఫోన్ నంబర్ ముందు +92 అన్న కంట్రీ కోడ్ కూడా ఉంది. ముంబై వాసి ఫోన్ లిఫ్ట్ చేయగానే నిందితులు తమని తాము ముంబై పోలీసులుగా పరిచయం చేసుకున్నాడు. అతడి కుమారుడితో పాటు మరో ముగ్గురిని ఓ యువతిని అత్యాచారం చేసిన నేరంపై అదుపులోకి తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై ఎఫ్ఐఆర్ ఇంకా దాఖలు కాలేదని, పై అధికారులకు కూడా చెప్పలేదని ఫోన్లోని వ్యక్తి చెప్పుకొచ్చాడు. పిల్లాడిపై ఏ కేసు లేకుండా వదిలిపెట్టాలంటే తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు (Indian Man Receives Threatening WhatsApp Call From Pakistan Mumbai Police Responds).
Viral: వధువు తల్లి, వరుడి తండ్రికి మధ్య ప్రేమ.. పెళ్లికి ముందే ఇంట్లోంచి పరార్!
అయితే, ముంబై వ్యక్తి మాత్రం సైబర్ నేరగాళ్ల వ్యూహాన్ని పసిగట్టి వారికి చుక్కులు చూపించాడు. మీ పేరేంటి? ఏ పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నారు? అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. తన కుమారుడితో మాట్లాడిచ్చాలని డిమాండ్ చేశాడు. వాళ్లేమో ఏడుస్తున్న ఓ టీనేజర్ గొంతు వినిపించి పిల్లాడు మాట్లాడే స్థితిలో లేడని గుక్కపెట్టి ఏడుస్తున్నాడని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, ఇవేమీ పట్టించుకోని ముంబై వాసి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మీకెంత కావాలని అడిగాడు. తాము నలుగురం ఉన్నామని, కాబట్టి రూ.40 ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా పంపాలని అన్నారు. దీంతో, ముంబై వాసి రేప్ కొట్టేసేందుకు రూ.40 వేలు ఏంటి, నాలుగు లక్షలు తీసుకోవాలి అంటూ వారికి చురకలు అంటించాడు. తమ పప్పులు ఉడకలేదని అర్థం చేసుకున్న నిందితులు మారుమాట్లాడకుండా టక్కున ఫోన్ పెట్టేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఆడియో రికార్డింగ్ నెట్టింట కూడా వైరల్ కావడంతో ముంబై పోలీసులు స్పందించారు. అవగాహనతో ఇలాంటి సైబర్ నేరగాళ్లకు సులువుగా బుద్ధిచెప్పొచ్చన్నారు. ముంబై వ్యక్తిపై ప్రశంసలు కూడా కురిపించారు.
Updated Date - Jul 18 , 2024 | 04:41 PM