ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Railways: అపరిశుభ్ర టాయిలెట్.. రైల్వేకు వినియోగదారుల కోర్టు షాక్!

ABN, Publish Date - Nov 01 , 2024 | 12:24 PM

భారతీయ రైల్వేకు ఓ వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. అపరిశుభ్ర టాయిలెట్, పనిచేయని ఏసీ కారణంగా ఇబ్బంది ఎదుర్కొన్న ప్రయాణికుడికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైల్వేకు ఓ వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. అపరిశుభ్ర టాయిలెట్, సరిగా పనిచేయని ఏసీ కారణంగా ఇబ్బంది ఎదుర్కొన్న ప్రయాణికుడికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. న్యాయ ఖర్చుల కింద బాధిత కస్టమర్‌కు మరో రూ.5 వేలు ఇవ్వాలని తీర్పు వెలువరించింది (Viral).

Viral: పాపం.. వధువు! నలుగురి ముందు వరుడు చేసిన పనికి..


పూర్తి వివరాల్లోకి వెళితే, వైజాగ్‌కు చెందిన వి. మూర్తి ఇటీవల తిరుపతి నుంచి దువ్వాడ‌కు రైల్లో వెళుతూ వసతుల లేమి కారణంగా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కస్టమర్ కథనం ప్రకారం, తొలుత వారు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైల్లో నాలుగు 3ఏసీ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారికి బీ-7 కోచ్‌లో బెర్తులను కేటాయించారు. ఆ తరువాత వారిని 3ఏ నుంచి 3ఈకి మారుస్తున్నట్టు రైల్వే నుంచి మెసేజ్ అందింది. ఇక జూన్ 5న మూర్తి తన కుటుంబంతో కలిసి రైల్లో బయలుదేరారు. జర్నీలో ఉండగా బోగీలోని టాయిలెట్‌లో కనీసం నీరు కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. బోగీలో ఏసీ కూడా పనిచేయకపోవడం వారికి తీవ్ర అసంతృప్తి కలిగించింది. బోగీ మొత్తం అపరిశుభ్రంగా ఉంది. దీంతో, ఆయన దువ్వాడలో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేశారు. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.

Viral: ఈ ఆటోవాలా కోహినూర్ వజ్రం!


ఇదిలా ఉంటే, మూర్తి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రైల్వే చెప్పుకొచ్చింది. పరిహారం రూపంలో ప్రజాధనం కోసం ఈ కేసు వేసినట్టు ఉందని చెప్పుకొచ్చింది. రైల్వే కల్పించిన వసతులతో వారు ప్రయాణం పూర్తి చేసినట్టు వాదించింది.

కానీ, వైజాగ్ జిల్లా కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెస్ కమిషన్ మాత్రం రైల్వే వాదనను తిరస్కరించింది. టిక్కెట్టు కొనుక్కున్న వినియోగదారులకు సక్రమంగా పనిచేసే టాయిలెట్, ఏసీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత రైల్వేకు ఉందని స్పష్టం చేసింది. మూర్తి ఫిర్యాదు తరువాత రైల్వే సిబ్బందిని పంపించి టాయిలెట్ సమస్యను పరిష్కరించిన విషయాన్ని అంగీకరించింది. అయితే, కనీస తనిఖీలు లేకుండా దక్షిణ మధ్య రైల్వే ఈ సర్వీసును నడిపినట్టు తన తీర్పులో పేర్కొంది.

Viral: అమెరికన్ పాప్ స్టార్‌ను ‘జై శ్రీరామ్’ అనాలని కోరిన భారతీయ అభిమాని!

Read Latest and Viral News

Updated Date - Nov 01 , 2024 | 12:37 PM