Viral Video: ఇండియన్ సూపర్ మ్యాన్‌ను చూశారా? రిక్షాను ఎలా నడుపుతున్నాడో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN, Publish Date - Dec 18 , 2024 | 03:25 PM
చాలా మంది నిర్లక్ష్యంగా బైక్ స్టంట్‌లు చేయడం, కార్లను వేగంగా నడపడం, ఓవర్‌లోడ్ చేయడం వరకు ఎన్నో సాహసాలు చేస్తుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
భారతీయ రోడ్లపై వాహనదారులు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ట్రాఫిక్ నియమాలకు అనుగుణంగా కాకుండా, అసాధారణంగా, సాహసోపేతంగా ప్రయాణాలు సాగిస్తుంటారు. నిర్లక్ష్యంగా బైక్ స్టంట్‌లు (Bike Stunts) చేయడం, కార్లను వేగంగా నడపడం, ఓవర్‌లోడ్ చేయడం వరకు ఎన్నో సాహసాలు చేస్తుంటారు. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).
@WhyyArya అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రిక్షా డ్రైవర్ తన వాహనంపై పెద్ద చెక్క పలకలను తీసుకెళ్తున్నాడు. దాంతో అతడికి సీటు మీద కూర్చోవడానికి కూడా స్థలం లేదు. దీంతో అతడు ఆ చెక్క పలకలపై పడుక్కుని బండిని నడుపుతున్నాడు. వాహనాలు బిజీగా తిరుగుతున్న రోడ్డుపై అతడు ఆ విధంగా ప్రయాణించాడు. ఫ్లైఓవర్‌పై వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఓ వ్యక్తి అతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ``ఇండియాలో సూపర్‌మ్యాన్‌ను చూశా. నిజమైన హెవీ డ్రైవర్`` అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.5 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.2 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``గాల్లో వెళుతున్నట్టు ఉంది``, ``వామ్మో.. ఇది ఎంత ప్రమాదకరం``, ``"అతను బ్రేకులు ఎలా వేస్తాడు``, ``నేను చిన్నప్పుడు మంచం మీద పడుక్కుని అలాగే నటించేవాడిని``, ``చివరకు అతడి పరిస్థితి ఏమైంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
IQ Test: మీ తెలివికి సవాల్.. ఆ ఇద్దరిలో అబద్ధం ఎవరు చెబుతున్నారో కనుక్కోండి..
Viral News: ఒక్క ముద్దు.. ఆమెను చావు అంచుల వరకు తీసుకెళ్లింది.. ఆమె చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే..
Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే.. 19 ఏళ్ల బాలుడిని గ్రైండర్ ఏం చేసిందో చూడండి..
Viral Video: రామ.. రామ.. ఇదెక్కడి దారుణం.. హనుమాన్ ఛాలీసాకు బార్ గర్ల్స్ డ్యాన్స్ చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 18 , 2024 | 03:55 PM