Viral: ఛీ.. ఇలాకూడా స్నానం చేస్తారా.. ఈ బాత్రూం కట్టినోడు కనపడితే వెంటపడి కొడతారు..
ABN, Publish Date - Dec 07 , 2024 | 04:19 PM
చిత్రవిచిత్ర నిర్మాణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. ఒకరు రోడ్డుపై ఇల్లు కట్టి అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరొకరు త్రిభుజాకారంలో ఇల్లు నిర్మించి అంతా అవాక్కయ్యేలా చేశాడు. అలాగే ఇంకో వ్యక్తి చిన్న దుకాణంపై వెడల్పు భవనం నిర్మించిన ఘటనను కూడా అంతా చూశాం. తాజాగా..
చిత్రవిచిత్ర నిర్మాణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. ఒకరు రోడ్డుపై ఇల్లు కట్టి అందరినీ ఆశ్చర్యపరిస్తే.. మరొకరు త్రిభుజాకారంలో ఇల్లు నిర్మించి అంతా అవాక్కయ్యేలా చేశాడు. అలాగే ఇంకో వ్యక్తి చిన్న దుకాణంపై వెడల్పు భవనం నిర్మించిన ఘటనను కూడా అంతా చూశాం. తాజాగా, ఓ వ్యక్తి బాత్రూంను వినూత్న ఏర్పాట్లు చేసి అంతా షాక్ అయ్యేలా చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను చూసిన వారంతా.. ‘‘ఛీ.. ఇలాకూడా స్నానం చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బాత్రూంలో (bathroom) చిత్రవిచిత్రమైన ఏర్పాట్లు చేశాడు. సాధారణంగా ఎవరైనా బాత్రూం నిర్మించే సమయంలో వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి అందులో ఏర్పాట్లు చేస్తుంటారు. కొందరు ఎక్కువ ఖర్చు చేసి బాత్ టబ్, షవర్, గీజర్ తదితర ఏర్పాట్లు చేసుకోవడం చూస్తుంటాం.
Viral Video: ఉంగరం కోసం వధూవరుల మధ్య పోటాపోటీ.. చివరకు వరుడికి ఎలా షాక్ ఇచ్చిందో చూస్తే..
అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఆలోచించాడు. తన బాత్రూంలో విచిత్రమైన షవర్‌ను సెట్ చేసుకున్నాడు. ఇండియన్ టాయిలెట్ కమోడ్‌ను (Indian toilet commode) సీలింగ్‌పై పెట్టించాడు. ఆ కమోడ్ నుంచి షవర్ (shower) నీరు కిందకు పడేలా ఏర్పాట్లు చేశాడు. ఈ బాత్రూంలో ఇతను చేసిన ఈ వింత ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ ఐడియా వచ్చినోడికి గన్ సెల్యూట్ చేయాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ బాత్రూం కట్టినోడు కనపడితే వెంటబడి కొట్టాలి’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 62 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కోబ్రా కాటేస్తున్నా పట్టించుకోని కోతి.. చివరకు ఏం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 07 , 2024 | 04:19 PM