ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: 5 స్టార్ హోటల్ బాల్కనీలో దుస్తులు ఆరేసిన భారతీయ మహిళ! చివరకు..

ABN, Publish Date - Jun 28 , 2024 | 06:48 PM

దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఓ మహిళ అక్కడి ఫైవ్ స్టార్ హోటల్ లోని ఐదవ అంతస్తులో ఉన్న బాల్కనీలో దుస్తులు ఆరేసింది. ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తుండటంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఓ మహిళ అక్కడి ఫైవ్ స్టార్ హోటల్ లోని ఐదవ అంతస్తులో ఉన్న బాల్కనీలో దుస్తులు ఆరేసింది. మహిళ కుమార్తె పల్లవి వెంకటేశ్ స్వయంగా ఈ వీడియో పోస్టు చేశారు. ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తుండటంతో వీడియో విపరీతంగా వైరల్ (Viral) అవుతోంది.

Viral: లివర్‌ను దానం చేసేందుకు మైనర్ బాలికకు కోర్టు అనుమతి! ఎందుకంటే..

పల్లవి వెంకటేశ్ తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో విహార యాత్రకు వెళ్లారు. అక్కడ ది పామ్ అట్లాంటిస్ అనే ఫైవ్ స్టార్ హోటల్ లో దిగారు. ఈ క్రమంలో పల్లవి తల్లి తమ గదిలోని బాల్కనీలో దుస్తులు ఆరేసింది. ఈ వీడియోను షేర్ చేసిన పల్లవి.. తల్లి ఎక్కడున్నా సరే తన బాధ్యతలను మర్చిపోదు అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు (Indian woman dries clothes on balcony of 5-star resort in Dubai Hotel responds).


అయితే, ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఘాటు విమర్శలు చేశారు. విదేశాల్లో ఇలా చేయడం మర్యాద కాదని అభిప్రాయపడ్డారు. ఏదైనా హోటల్‌లో బస చేసినప్పుడు అక్కడి నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నెట్టింట తెగ ట్రెండ్ అయిన ఈ ఘటన హోటల్ యాజమాన్యం దృష్టికి కూడా వెళ్లింది. ఓ గృహిణి, మాతృమూర్తి యథాప్రకారం తన బాధ్యతలు నిర్వహిస్తోంది అంటూ ఆమెకు అండగా నిలిచింది.

అయితే, దుస్తులు ఆరేసుకునేందుకు గదిలో ప్రత్యేక సదుపాయం కూడా ఉందని హోటల్ యాజమాన్యం చెప్పింది. అయినా కూడా కొందరు విమర్శలు తగ్గించకపోవడంతో ఓ వ్యక్తి స్పందిస్తూ మహిళపై విమర్శలు ఆపాలని స్పష్టం చేశారు. హోటల్ వారికి లేని అభ్యంతరం నెటిజన్లకు ఎందుకని అన్నారు. యూకేలో చాలా మంది ఇలాచే చేస్తారని, దుస్తులు ఆరేసేందుకు ఇదే సహజమైన పద్ధతి ట్రోలర్ల నోటికి తాళం వేశాడు.

Read Viral and Telugu News

Updated Date - Jun 28 , 2024 | 06:48 PM

Advertising
Advertising