Viral: షాకింగ్ వీడియో! ఈ భారతీయ యువకుడు బంగ్లాదేశ్‌లో ఏం చేశాడో చూస్తే..
ABN, Publish Date - Dec 12 , 2024 | 08:27 PM
బంగ్లాదేశ్‌లో ఓ భారతీయ యువకుడు ఏకంగా రైలు ఇంజెన్‌పై బోర్లా పడుకుని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బస్సులు, రైళ్ల పైకెక్కి ప్రయాణించడం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా లోకల్ ట్రైన్ల విషయంలో జనాలు ఇలాంటి సాహసాలకు పూనుకుంటూ ఉంటారు. ఇలాంటి దృశ్యాలు భారత్‌తో పాటు పొరుగున్న దేశాల్లోనూ కనబడుతుంటాయి. అయితే, సోషల్ మీడియా వచ్చాక కొందరు చదువుకున్న యువత కూడా ఇలాంటి దుస్సాహసాలకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి ఓ ఉదాహరణ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral).
Viral: యాచకుడిలా నటించిన వ్లాగర్ ! రోజంతా భిక్షాటనతో ఎంతొచ్చిందంటే..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, బంగ్లాదేశ్‌లో ఓ భారతీయ యువకుడు ఏకంగా రైలు ఇంజెన్‌పై బోర్లా పడుకుని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తను చేస్తున్నది తప్పని తెలిసిన అతడు ఇలా మరెవరూ చేయొద్దంటూనే ఈ వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో తీసేందుకు చాలా రిస్క్ చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. రైలు ఇంజెన్‌పై నుంచి కింద పడిపోకుండా ఓ చేత్తో ఇంజెన్‌పై ఉన్న బల్బు పట్టుకుని మరో చేత్తో స్మార్ట్ ఫోన్ పట్టుకుని వీడియో రికార్డు చేశాడు. ఇతర జాగ్రత్తలేవీ తీసుకోకుండా రైలుపైకి ఎక్కి ఇంత రిస్క్ చేశాడు.
Britain: క్రిమినాలజీ విద్యార్థి దారుణం! హత్య చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని..
ఇక వీడియో చూసిన జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇది ఇప్పటివరకూ కోటికిపైగా వ్యూస్ రాబట్టింది. తనకేం ప్రమాదం జరగదనట్టు ధీమా వ్యక్తం చేస్తున్న అతడిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. కొందరు సరదా కామెంట్స్ చేశారు. రైల్లో సీటు దొరక్క అలా ఇంజెన్ పైకి ఎక్కి ఉంటాడని కొందరు కామెంట్ చేశారు. తదుపరి విమానంపైకెక్కి ఇలా సెల్ఫీకి ట్రై చేయమని సలహా ఇచ్చారు. ఈ రోజు యమధర్మరాజు సెలవులో ఉన్నట్టు ఉన్నాడు లేకపోతే ఇతడు పరలోకానికి చేరి ఉండేవాడు అని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇలా అతి చేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దని మరికొందరు హితవు పలికారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకయ్యేలా చేస్తోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Updated Date - Dec 12 , 2024 | 08:27 PM