Viral: విమానం నడపబోనంటూ మొండికేసిన పైలట్.. ఎయిర్‌లైన్స్ వివరణ!
ABN, Publish Date - Oct 03 , 2024 | 12:56 PM
విమానం నడిపేది లేదంటూ ఇండిగో సంస్థకు చెందిన ఓ పైలట్ మొండికేశాడన్న ఆరోపణలపై తాజాగా ఎయిర్‌లైన్స్ స్పందించింది. విమాన కార్యకలాపాలకు సంబంధించి కొన్ని అవాంతరాల కారణంగా విమానం టేకాఫ్ ఆలస్యమైందని తాజాగా వివరణ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: విమానం నడిపేది లేదంటూ ఇండిగో సంస్థకు చెందిన ఓ పైలట్ మొండికేశాడన్న ఆరోపణలపై తాజాగా ఎయిర్‌లైన్స్ స్పందించింది. విమాన కార్యకలాపాలకు సంబంధించి కొన్ని అవాంతరాల కారణంగా విమానం టేకాఫ్ ఆలస్యమైందని తాజాగా వివరణ ఇచ్చింది. అయితే, ఈ ఘటన తాలూకు వీడియోలు మాత్రం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..
పూర్తి వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 24న పూణె నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఓ విమానం ఏకంగా ఐదు గంటలు ఆలస్యమైంది. పైలట్ విమానం నడిపేందుకు నిరాకరించాడంటూ కొందరు నెట్టింట వీడియోలు షేర్ చేశారు. విమానం ఆలస్యం కావడంలో పలు ప్రయాణికులు పైలట్‌ను, విమానం క్రూను నిలదీసిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అసలేం జరుగుతోందో వివరణ ఇవ్వాలని ప్రయాణికులు ఎంతగా డిమాండ్ చేసినా పైలట్ పట్టించుకోలేదట.
Viral: అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1,357 కిలోమీటర్ల వేగంతో కిందకొస్తూ..
కాక్ పిట్‌లోంచి బయటకు రాని పైలట్ చివరకు ప్యాసెంజర్లకు వివరణ ఇవ్వకుండా తన కేబిన్ డోర్ మూసుకున్న దృశ్యాలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆలస్యానికి కారణాలు చెప్పకుండా ఇలా ముఖం మీద తలుపు వేయడం ఏంటని ఓ మహిళ ప్రశ్నించింది. తన డ్యూటీ ముగిసిందంటూ పైలట్ విమానం నడిపేందుకు ముందుకు రాలేదని ఆయూష్ కుమార్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా షేర్ చేశారు. పైలట్ కారణంగా ప్రయాణికులు విమానంలోనే ఐదు గంటల పాటు గడపాల్సి వచ్చిందని, కనీసం డ్రింక్స్, స్నాక్స్ వంటివి కూడా ఇవ్వలేదని వాపోయారు. అసలు ఇలాంటి ఘటన ఎందుకు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా ఈ వీడియోలు విపరీతంగా వైరల్ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, ఇండిగో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Viral: వామ్మో.. గర్ల్స్ హాస్టల్‌లో రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా?
డ్యూటీ టైంకు సంబంధించి కొన్ని ఆటంకాల కారణంగా విమానం ఆలస్యమైనట్టు ఇండిగో తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. కస్టమర్స్‌కు ఈ సమస్యపై అప్పుడే వివరణ ఇచ్చామని పేర్కొంది. ఆ సమయంలో మిగతా సిబ్బంది అంతా ప్రయాణికులకు అందుబాటులోనే ఉన్నారని చెప్పుకొచ్చింది. అయితే, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. కాగా, అంతకుమునుపు, ఎయిర్‌పోర్టులోని ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది.
Viral: స్ఫూర్తి రగిలించే గెద్ద వీడియో.. ఆనంద్ మహీంద్రా కామెంట్స్ వైరల్!
Updated Date - Oct 03 , 2024 | 01:06 PM