ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IndiGo: ‘ఇండిగో’ ఉప్మాపై హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్ కీలక కామెంట్స్.. వెంటనే స్పందించిన ఎయిర్ లైన్స్!

ABN, Publish Date - Apr 18 , 2024 | 07:19 PM

ఇండిగో విమానాల్లో ఇచ్చే ఉప్మా, పోహాల్లో ఉప్పు ఎక్కువగా ఉందంటూ ఓ హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫిర్యాదుపై ఎయిర్‌లైన్స్ స్పందించింది. నిబంధనలకు అనుగుణంగానే తాము విమానాల్లో ఆహారం సరఫరా చేస్తున్నట్టు వివరణ ఇచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఇచ్చే ఉప్మా, పోహాలో ఉప్పు ఎక్కువైందంటూ ఓ హెల్త్ ఇన్‌ఫ్లయెన్సర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్ కూడా స్పందిస్తూ తన వివరణ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ (Viral) అవుతున్న ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..

‘‘ఇదో షాకింగ్ వీడియో. సాధారణంగా మ్యాగీ లాంటి పదార్థాల్లో ఉప్పు ఎక్కువన్న విషయం తెలిసిందే. కానీ చాలమందికి తెలీనది ఏంటంటే.. ఇండిగో విమానంలోని ఉప్మాలో (IndiGo Upma, Poha) కూడా మ్యాగీ కంటే 50 శాతం అధికంగా ఉప్పు ఉంటుంది. పోహాలో 80 శాతం ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇక దాల్ చావల్‌లో కూడా మ్యాగీతో సమానంగా ఉంటుంది’’

Viral: ఆరేళ్ల క్రితం చనిపోయాడనుకున్న బిలియనీర్.. ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలిసి అందరికీ షాక్..


‘‘ఉప్మా, పోహా, దాల్ చావల్ ఆరోగ్యకరమైన ఆహారంగా అనిపించినా ప్రతిసారీ అవి ఆరోగ్యకరమని భావించకూడదు. జంక్ ఫుడ్స్ కంటే ఆరోగ్యకరమైనవిగా పేరు పడ్డ ఆహారాలతోనే ప్రమాదం ఎక్కువ. ఇప్పటికే భారతీయులు సోడియం (ఉప్పు) (High Sodium) అధికంగా ఉన్న ఆహారం తింటున్నారు. రెగ్యులర్‌గా సోడియం ఎక్కువ ఉన్నవి తింటే బీపీ వస్తుంది. ఇది చివరకు గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది’’ అని చెప్పుకొచ్చారు (IndiGos poha and upma have high sodium, alleges influencer airline clarifies).

ఈ వీడియో వైరల్ కావడంతో ఇండిగో కూడా స్పందించింది. ‘‘మేము తాజా, ప్రీప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను సర్వ్ చేస్తాము. ఇక్కడి ఆహారాల్లో ఉప్పు నిబంధనలకు లోబడే ఉంటుంది’’ అని పేర్కొంది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 07:40 PM

Advertising
Advertising