ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: రీల్ కోసం నడిరోడ్డుపై హద్దుమీరిన యువతి.. మరీ ఇంత అవసరమా?

ABN, Publish Date - May 11 , 2024 | 04:51 PM

ప్రస్తుత తరంలోని యువతకు ‘ఇన్‌స్టాగ్రామ్ రీల్స్’ పిచ్చి ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చాలామందికి రీల్స్ చేయడమే దినచర్యగా మారింది. వ్యూస్ & లైక్స్ కోసం.. డాన్స్, యాక్టింగ్, స్టంట్స్ వంటి రకరకాల..

ప్రస్తుత తరంలోని యువతకు ‘ఇన్‌స్టాగ్రామ్ రీల్స్’ (Instagram Reels) పిచ్చి ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చాలామందికి రీల్స్ చేయడమే దినచర్యగా మారింది. వ్యూస్ & లైక్స్ కోసం.. డాన్స్, యాక్టింగ్, స్టంట్స్ వంటి రకరకాల వీడియోలు చేస్తూ ఉంటారు. కొందరైతే.. ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదగాలన్న ఉద్దేశంతో హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ప్రాణాలకు ముప్పు కలిగించే భయంకరమైన స్టంట్స్ చేయడమో.. వివాదాస్పద చర్యలకు పాల్పడటమో చేస్తుంటారు. ఇప్పుడు ఓ యువతి కూడా అలాంటి పనే చేసింది. నడిరోడ్డుపై తుపాకి పట్టుకొని డ్యాన్స్ చేసింది. దీంతో.. ఇది వివాదాస్పదమవ్వడంతో, ఆమె చిక్కుల్లో పడింది.


యోగిని కూడా మోదీ వదిలిపెట్టరు.. మరో రెండు నెలల్లో..

ఆ యువతి పేరు సిమ్రన్ యాదవ్ (Simran Yadav). ఆమె ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఇప్పటికే ఆమెకు యూట్యూబ్‌లో (Youtube) 1.8 మిలియన్ సబ్‌స్క్రైబర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ ఫాలోవర్స్‌ని కలిగి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఆమె ఓ సెలబ్రిటీ హోదాని కలిగి ఉంది. ఆ లెక్కన ఆమె ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ.. ఇందుకు భిన్నంగా ఆమె లక్నో (Lucknow) హైవేపై తుపాకీ చేతిలో పట్టుకుని, డ్యాన్స్ చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేసింది. రీచ్ కోసమే సిమ్రన్ ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడం, ఆమె చర్య ప్రమాదకరమైంది కావడంతో.. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఓ యువతి తుపాకీతో రీల్స్ చేస్తూ బహిరంగంగా చట్టాల్ని అతిక్రమిస్తుంటే.. అధికారులు ఏం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ అణుబాంబు వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ రియాక్షన్

సిమ్రన్ యాదవ్ చేసిన ఈ వీడియోపై కళ్యాణి చౌదరి అనే అడ్వకేట్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఇన్‌స్టాగ్రామ్ స్టార్, యూట్యూబర్ సిమ్రన్ యాదవ్ ఇలా లక్నోలో నడిరోడ్డుపై డ్యాన్స్ చేసింది. అది కూడా రూల్స్ అన్ని పక్కన పెట్టేసి, చేతిలో తుపాకీ పట్టుకొని ఈ వీడియో అప్‌లోడ్ చేసింది. వాళ్ల కమ్యూనిటీ గురించి చెప్పుకునే పద్ధతి ఇదేనా? ఇంత చేస్తున్నా.. అధికారులు మాత్రం స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది’’ అంటూ పేర్కొన్నారు. కాగా.. ఈ వీడియో వైరల్ అవడంతో లక్నో పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని, ఆ యువతిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - May 11 , 2024 | 04:51 PM

Advertising
Advertising