ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వారెవ్వా.. పనిమనిషికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూడండి..!

ABN, Publish Date - Oct 19 , 2024 | 09:40 PM

తమ ఇంట్లో సహాయకురాలిగా ఉంటున్న మహిళ సొంతింటి కలను నెరవేర్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌‌పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: తమ ఇంట్లో సహాయకురాలిగా ఉంటున్న మహిళ సొంతింటి కలను నెరవేర్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌‌పై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. పైసా అప్పు చేయకుండా ఆమె ఎలా సొంతింటిదారు అయ్యిందీ చెబుతూ అనీశ్ భగత్ అనే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.

తమ ఇంట్లో పనిచేస్తున్న రేష్మా అనే మహిళ తనకంటూ ఓ గూడు ఎలా అమర్చుకున్నదీ చెబుతూ అనీశ్ ఈ వీడియో షేర్ చేశారు. కొత్తింటి గృహప్రవేశం, రేష్మా తన ఇంటిని పరిచయం చేసిన తీరును నెట్టింట పంచుకున్నాడు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ ద్వారా ఆమె తన లక్ష్యాన్ని చేరిందని చెప్పాడు.

Viral: జర్మనీలో ఈ ఎన్నారైలు ఏం చేశారో చూడండి.. నెట్టింట తిట్ల వర్షం!


‘‘దాదాపు ఏడాదిన్నర క్రితం నేను రేష్మా అక్కా.. ఆర్థిక స్వావలంబన గురించి చర్చించాం. తన సొంత కాళ్లపై నిలబడాలని ఉందని ఆమె తన మనసులో మాట చెప్పింది. తన బిడ్డల కోసం ఓ గూడు అమర్చాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది. దీంతో, ఆమె తన కల నెరవేర్చుకునే ప్రయాణంలో నా వంతు సాయం చేద్దామనుకున్నా’’ అని అతడు వీడియోలో చెప్పుకొచ్చాడు. తన బ్రాండెడ్ కంటెంట్ ప్రాజెక్టుల్లో తనని భాగం చేశానని, ఇలా వచ్చిన పారితోషికంలో కొంత ఆమెకు కూడా ఇచ్చానని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో కొన్నిసార్లు విమర్శలు వచ్చినా తాను వెనక్కు తగ్గలేదని అన్నాడు. ఆమెకు ఆర్థిక స్వావలంబన కల్పించాలన్న తన లక్ష్యాన్ని ఎట్టకేలకు చేరుకున్నానని హర్షం వ్యక్తం చేశాడు.

Viral: ఈ బస్సు డ్రైవర్ గ్రేట్.. అందరూ ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలే జరగవు!


రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు నెట్టింట భారీగా స్పందన వచ్చింది. ఏకంగా 54 లక్షల వ్యూస్ వచ్చాయి. అనేక మంది అనీశ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అనీశ్ సాయం నిజంగా స్ఫూర్తిమంతమని అన్నారు. ఓ పనిమనిషికి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చాడంటే అతడిది ఎంత గొప్ప మనసో అని ప్రశంసించారు. మరికొందరు రేష్మాపై కూడా ప్రశంసలు కురిపించారు. ‘‘తన కలం సాకారం చేసుకునేందుకు ఆమె పడ్డ కష్టం అనితరసాధ్యం. ఆమె డెడికేషన్ సూపర్’’ అని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఆసక్తికర వీడియోను మీరూ చూసేయండి.

Viral: శాకాహారినైనందుకు గర్వంగా ఉందన్న యువతి! నెట్టింట దుమారం!

Read Latest and Viral News

Updated Date - Oct 19 , 2024 | 09:44 PM