Viral: సర్‌ప్రైజ్ చేద్దామని వెళ్లిన కొడుకు చెంప ఛెళ్లుమనిపించిన తండ్రి.. షాకింగ్ వీడియో!
ABN, Publish Date - Jun 20 , 2024 | 07:37 PM
తండ్రి చెప్పినా వినకుండా గడ్డం తీయించుకొచ్చిన ఓ యువకుడికి భారీ షాక్ తగిలింది. అతడి లుక్ నచ్చని తండ్రి నా మాట ఎందుకు వినలేదంటూ చెంచ ఛెళ్లుమనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం పరిపాటి. చిన్న చిన్న బహుమతుల నుంచి ఖరీదైన గిఫ్ట్‌ల వరకూ సర్‌ప్రైజ్‌లు ఎన్నో రకాలు. కొన్ని ఆశించిన ఫలితాన్ని ఇస్తే మరికొన్ని బ్యాక్‌ఫైర్ అవుతుంటాయి. ఓ యువకుడి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. తన తండ్రిని సర్‌ప్రైజ్ చేద్దామనుకుంటే అతడికి చివరకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
VandeBharat: ‘వందేభారత్’ మీల్స్‌లో బొద్దింక.. క్షమాపణలు చెప్పిన ఐఆర్‌సీటీసీ
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, క్షవరం చేయించుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు పూర్తిగా గడ్డం తొలగించుకుని క్లీన్ షేవ్‌తో ఇంటికి వచ్చాడు. తండ్రిని సర్‌ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో తన ముఖం కనిపించకుండా అటువైపు తిరిగాడు. తండ్రి రియాక్షన్ కెమెరాలో చిత్రికరించేందుకు సెల్ఫీ వీడియో రికార్డింగ్ ప్రారంభించాడు. ఇంతలో బయటకొచ్చిన తండ్రి..అటువైపు తిరిగున్న కొడుకు ముఖం చూడగనే క్షణకాలం బిగుసుకుపోతాడు. కొడుకేమో తండ్రిని బాగా సర్‌ప్రైజ్ చేశాననుకుంటూ ముసిముసినవ్వులు నవ్వాడు. కానీ తండ్రిలో అప్పటికే కోపం కట్టలు తెంచుకోవడంతో.. నువ్వు నా మాట ఎప్పుడూ వినవు అంటూ ఒక్కసారిగా అతడి చెంప ఛెళ్లుమనిపించాడు. అదే ఊపులో మరోసారి మరింగ గట్టిగా గోబగుయ్యిమనిపించాడు (Internet In Shock As Man Slaps Son For Shaving His Beard).
వీడియో చూసి జనాలు కూడా షాకైపోయారు. తండ్రి కూడా గడ్డం, మీసం పెట్టుకోలేదుగా? మరి కొడుకు మీద ఎందుకంత కోపం అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఇలాంటి క్రమశిక్షణ వల్లే పిల్లలు చెడిపోయేది అని మరికొందరు కామెంట్ చేశారు. ఈకాలంలో కన్నబిడ్డల్ని ఇలా దండించడం ఏమాత్రం బాలేదని పెదవి విరిచారు. మరికొందరు మాత్రం కామెడీ బాగా పండిందంటూ సెటైర్లు పేల్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
Updated Date - Jun 20 , 2024 | 07:42 PM