ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఇది నిజమా..? చిన్న కిటుకుతో బైక్ మైలేజీ ఏకంగా 90 కేఎమ్‌పీఎల్!

ABN, Publish Date - Mar 25 , 2024 | 03:54 PM

తన టెక్నిక్ పాటిస్తే బైక్ మైలేజీ లీటరుకు 90 కిలోమీటర్లకు పెరిగేలా చేస్తానంటున్న ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: బైక్ కొనాలనుకునే వారు సాధారణంగా చూసే మొదటి అంశం మైలేజీ (Mileage). ఇక భారతీయులు వాహనాల మైలేజీకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టూ వీలర్లు సాధారణంగా లీటరుకు 45 నుంచి 60 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తుంటాయి. ఇక కార్ల వంటి వాటి మైలేజీ లీటరుకు 20 వరకూ ఉంటుంది.

Viral: మీ ఇంట్లో వేరే వాళ్లు ఉంటున్నారంటూ పక్కింటి వ్యక్తి నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే..


అయితే, తన కిటుకు పాటిస్తే బైకు మేలేజీ ఏకంగా లీటరుకు 90 కిలోమీటర్లకు చేరుకుంటుందని ఓ వ్యక్తి చెప్పాడు. అంతేకాదు, ఈ కిటుకు పాటిస్తే బండి పొగ కూడా తక్కువగా విడుస్తుందని అంటున్నాడు. దీంతో, అతడి వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral Video) మారింది. జనాల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ వ్యక్తి ఇంజిన్‌కు ఓ చిన్న సెమీ కండక్టర్ అనుసంధానించాడు. ఇలా చేస్తే మైలేజీ కచ్చితంగా 90 కిలోమీటర్లకు చేరుకుంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. కానీ, ఆ మైలేజీని నిరూపించే ప్రయత్నం మాత్రం చేయలేదు (Man suggest technique to increase mileage to 90kmpl).


దీంతో, వీడియో చూసిన జనాలు మండి పడుతున్నారు. తన మైలేజీని నిరూపించే ప్రయత్నం చేయలేదంటేనే అది ఫేక్ అని అర్థమైపోతోందంటూ కొందరు కామెంట్ చేశారు. ఇది నిజంగా సాధ్యమే అయితే ఈ పాటిని ఇంజినీర్లు ఎప్పుడో ఇలా చేసి ఉండేవారని అన్నారు. వైరల్ అవ్వాలనే తాపత్రయంలో జనాలు ఏది తోస్తే అది చేస్తున్నారంటూ మండిపడ్డారు. జనాలకు ఆగ్రహం తెప్పిస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 04:21 PM

Advertising
Advertising