Cognizant: దిగ్గజ ఐటీ సంస్థలో ఫ్రెషర్ల శాలరీ ఇదా! నెట్టింట పెల్లుబుకుతున్న ఆగ్రహం
ABN, Publish Date - Aug 20 , 2024 | 07:20 PM
ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో ఫెషర్స్ శాలరీ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ శాలరీతో కసీనం బతకలేమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఈవీపీ) సూర్య గుమ్మడి స్వయంగా స్పందించారు. శాలరీకి సంబంధించి సవివరమైన ప్రకటన చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో ఫెషర్స్ శాలరీ అంశం వివాదాస్పదంగా మారింది. ఫ్రెషర్లకు ఏటా కేవలం రూ.2.52 లక్షల శాలరీనే ఇస్తున్నట్టు వెలుగులోకి రావడంతో నెట్టింట ట్రోలింగ్ పతాకస్థాయకి చేరుకుంది. ఈ శాలరీతో కసీనం బతకలేమని నెటిజన్లు (Viral) ఆగ్రహం వ్యక్తం చేయడంతో సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఈవీపీ) సూర్య గుమ్మడి స్వయంగా స్పందించారు. శాలరీకి సంబంధించి సవివరమైన ప్రకటన చేశారు. కంపెనీ ఉద్యోగ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.
Viral: దేవుడా! ఈ కార్పొరేట్ ఉద్యోగి దుస్థితి చూడండి.. నదిలో కూర్చుని..
ఈవీపీ ప్రకటన ప్రకారం, కంపెనీ ఉద్యోగ ప్రకటనల్లో పేర్కొన్న శాలరీ సాధారణ డిగ్రీ కోర్సులు చేసిన వారికి వర్తిస్తుంది. ఇది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇచ్చే జీతం కాదని ఈవీపీ స్పష్టం చేశారు. నైపుణ్యాలు, అర్హతలను బట్టి ఇంజినీరింగ్ డిగ్రీలున్న ఫ్రెషర్లకు ఏటా రూ.4 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకూ ఇస్తామని పేర్కొన్నారు. ఐటీ రంగంలో శాలరీల విషయంలో సంస్థల మధ్య తీవ్ర పోటీ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి తమ సంస్థలో ప్రత్యేకంగా ట్రెయినింగ్ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇంజినీరింగ్, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ గ్రాడ్యుయేట్ల కోసం సంస్థలో ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నారు (Internet Troll Cognizant Over Rs 2.52 Lakh Package For Freshers, Company Issues Clarification ).
కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి శిక్షణ కోసం రూ. 2 నుంచి రూ.3 లక్షలు ఖర్చు చేస్తామని ఈవీపీ చెప్పుకొచ్చారు. వివిధ నైపుణ్యాల్లో ఫ్రెషర్లకు శిక్షణ ఇస్తామన్నారు. మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు చదవి తమ సంస్థలో చేరే వారు మేనేజర్ నుంచి వైపీ ప్రెసిడెండ్ వరకూ వివిధ ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు.
కాగా, సంస్థలో శాలరీ పెంపు కేవలం ఒక శాతమేనన్న విషయంపై కూడా కాగ్నిజెంట్ ఇటీవల విమర్శల పాలైంది. దీనిపై కూడా ఈవీపీ వివరణ ఇచ్చారు. ఉత్పాదకతను అనుసరించి ఇచ్చే ఇంక్రిమెంట్లలో కనిష్ట పెంపు గురించి మాత్రమే వార్తల్లో వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. ఈ ఏడాది బోనస్‌లు, శాలరీ పెంపులు ప్రకటించిన అతికొన్ని ఐటీ సంస్థల్లో తాము ఒకరన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా, ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో శాలరీ పెంపు ఒక భాగం మాత్రమేనని వివరించారు.
Updated Date - Aug 20 , 2024 | 09:08 PM