ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: మొసలికి బీపీ తెప్పిస్తే ఇలాగే ఉంటుంది! ఎర చిక్కలేదని తిక్కరేగడంతో..

ABN, Publish Date - Jul 22 , 2024 | 07:53 PM

నోటికి చిక్కినట్టే చిక్కిన ఎర జారిపోవడంతో తిక్కరేగిన ఓ మొసలి సమీపంలోని పడవలో ఉన్న మనుషులపై దాడికి యత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతూ జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: డైనోసార్ల కాలం నుంచి భూమ్మీద జీవిస్తున్న జంతువుల్లో మొసలి ఒకటి. మందపాంటి చర్మం, దృఢమైన దవడలు, పళ్లు, బలిష్టమైన దేహం వెరసి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెట్టుకు రాగల నైపుణ్యం వీటి సొంతం. వీటికి కోపం కూడా అంతేస్థాయిలో ఉంటుంది. ఆకలి వేసిందంటే ఎదురుగా ఉన్న ఎలాంటి జంతువుపైన అయినా దాడి చేసేందుకు వెనకాడవు. వాటి దృష్టిపడ్డాక తప్పించుకోవడం అసాధ్యం. ఇలాంటి జంతువుకు కోపం తెప్పించిన కొందరు చివరకు జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.

Viral: పాము పగబట్టిందా? 50 రోజుల్లో ఏకంగా 7 సార్లు యువకుడికి పాము కాటు!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు కొలనులో చేపల వేటకు వెళ్లారు. ఎర వేసి చేపను పట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఎరను చూసిన మొసలి అటువైపు వేగంగా ఈదుకుంటూ వచ్చేసింది. ఈలోపు పడవలోని వారు ఎరను నీళ్లల్లోంచి పైకి లాగేసుకున్నారు. అప్పటికే అది తన ఆహారం కాదని మొసలికి అర్థమైంది. దీనికి తోడు పడవపైన వాళ్లు ఎరను పైకి లాగేశారు. ఇది చాలదన్నట్టు దానికి కలిగిన ఆశాభంగాన్ని చూస్తు పెద్దపెట్టున నవ్వారు. ఇదంతా చూసిన మొసలి ఒక్కసారిగా పడవలోకి దూకింది (Irked crocodile attacks men on boat after losing prey).


అంత భారీ మొసలి పడవలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో అందులోని వారు ఒక్కసారిగా షాకైపోయారు. ఆ దృశ్యాల్ని వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి కూడా హడలిపోయాడు. ఈలోపు మొసలి కూడా బెదిరి మళ్లీ నీళ్లల్లోకి దిగిపోయింది. అది చూసి ఊపిరి పీల్చుకున్న వారు ఆ తరువాత కాసేపటికి గానీ షాక్‌ నుంచి తేరుకోలేకపోయారు. ఇక వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు కూడా షాకైపోతున్నారు. మొసలికి కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేశారు. ఇలా రకరకాల వ్యాఖ్యల మధ్య వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 22 , 2024 | 07:56 PM

Advertising
Advertising
<