ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఆహారం కోసం వెతుకుతూ మొసలి కంట పడ్డ జాగ్వార్.. చివరికి మీరు కలలో కూడా ఊహించని భారీ ట్విస్ట్..

ABN, Publish Date - Mar 03 , 2024 | 03:07 PM

అడవిలో ఆహార వేటలో ఉన్న జంతువులకు కొన్నిసార్లు విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. తిరుగులేదు అని అనుకునే పెద్ద పెద్ద జంతువులకు సైతం అప్పుడప్పుడూ ఓటమి ఎదురవుతుంటుంది. మరికొన్నిసార్లు ఏకంగా చిన్న జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తుంటుంది. ఇలాంటి..

అడవిలో ఆహార వేటలో ఉన్న జంతువులకు కొన్నిసార్లు విచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. తిరుగులేదు అని అనుకునే పెద్ద పెద్ద జంతువులకు సైతం అప్పుడప్పుడూ ఓటమి ఎదురవుతుంటుంది. మరికొన్నిసార్లు ఏకంగా చిన్న జంతువుల దాడిలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ జాగ్వార్ ఆహార కోసం వెతుకుతూ చివరకు మొసలి కంటపడింది. చివరికి ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ జాగ్వార్ ఆహర వేటలో భాగంగా నీళ్లు ఉన్న ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ దానికి ఓ కొండచిలువ కనిపిస్తుంది. దాన్ని నోట కరుచుకుని ఒడ్డుకు తీసుకెళ్లే క్రమంలో తప్పించుకుని వెళ్లిపోతుంది. దీంతో ఆహారం కోసం నీళ్లలో ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఓ మొసలి కూడా ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. నీటిలోకి వెళ్లిన జాగ్వార్.. చివరకు మొసలి కంట పడుతుంది. మొసలిని చూడగానే జాగ్వార్ కూడా.. (crocodile attacked jaguar) ఎలాగైనా దాన్ని తినేయాలనే ఉద్దేశంతో ఎటాక్ చేస్తుంది.

Viral Video: ఈ తల్లి ఎలుగు ప్రేమకు సెల్యూట్ చేయాల్సిందే.. నీళ్లలో పడిన పిల్ల ఎలుగుబంటిని చూసి..

మొసలి కూడా జాగ్వార్‌ను తినేయాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయితే చివరకు జగ్వార్ ముందు తల వంచక తప్పలేదు. మొసలిని నీళ్లలోకి ముంచి, చివరకు దాని మెడ పట్టుకున్న జాగ్వార్.. నీటి ఒడ్డుకు తీసుకెళ్తుంది. జాగ్వార్ నంచి తప్పించుకోవడానికి మొసలి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. చూస్తుంటే మొసలి చివరకు జాగ్వార్‌కు ఆహారమైనట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ జాగ్వార్ టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 26 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ విచిత్ర ఆకారం.. తీక్షణంగా పరిశీలించగా.. చివరకు..

Updated Date - Mar 03 , 2024 | 03:07 PM

Advertising
Advertising