Viral: వామ్మో.. మనుషులను శుభ్రపరిచే వాషింగ్ మెషీన్!
ABN, Publish Date - Dec 09 , 2024 | 06:12 PM
మనుషులకు స్నానం చేయించే హ్యూమన్ వాషింగ్ మెషిన్‌ను వచ్చే ఏడాది జపాన్‌లో ప్రదర్శించనున్నారు. దీని ఫీచర్లపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అదేంటి.. మనుషులను శుభ్రం చేసేందుకు వాషింగ్ మెషీన్ ఎందుకూ? రోజూ స్నానం చేస్తాంగా అని అంటారా? మీ సందేహం కరెక్టే. అయితే, ఈ వాషింగ్ మెషీన్ కూడా మనుషులకు స్నానం చేయిస్తుంది. చూడటానికి చిన్నపాటి కార్ లాగా ఉండే ఈ వాషింగ్ మెషీన్‌లోని బల్లపై పడుకుంటే చాలు.. 15 నిమిషాల్లో స్నానం, ఒళ్లంతా ఆరబెట్టుకోవడం పూర్తవుతుందట. అందుకే దీనికి తయారీదారులు హ్యూమన్ వాషింగ్ మెషీన్ అని పేరుపెట్టారు. జపాన్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఓ ఇండస్ట్రియన్ ఎగ్జిబిషన్‌లో దీన్ని ప్రదర్శించనున్నారు (Viral).
Copper Toxicity: రాగి పాత్రలో నీటిని తాగుతారా? ఈ జాగ్రత్త పాటించకపోతే నీరు విషతుల్యం!
ఎమిటీ హ్యూమన్ వాషింగ్ మెషీన్!
జపాన్‌కు చెందని సైన్స్ కో అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. 1970ల్లోనే సాన్యో కంపెనీ డిజైన్ చేసిన హ్యూమన్ వాషింగ్ మెషీన్ స్ఫూర్తితో దీన్ని డిజైన్ చేశారు. చిన్న పాటి కారు ఆకారంలో ఉండే మెషీన్‌లో ఓ చిన్న బల్ల ఏర్పాటు చేశారు. ఈ మెషీన్ గోడలు పారదర్శకంగా ఉండటంతో లోపలు ఇరుక్కుపోతామే అన్న భయం కలగకుండా ఉంటుందట. కేవలం స్నానం మాత్రమే కాకుండా ఓ స్పాలో ఉన్న అనుభూతి కలిగేలా ఈ వాషింగ్ మెషీన్‌లో పలు ఏర్పాట్లు చేశారు. ఇది ఏఐ సాంకేతికత సాయంతో పనిచేస్తుంది. దీంతో, స్నానం చేసే వారి భావోద్వేగ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మెషీన్‌లోని వాతవరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి.
మెషీన్ లోపల ఆహ్లాదపరిచే పాటలు, మూడ్‌కు తగినట్టు నీటి ఉష్ణోగ్రత, సువాసనలు అన్నీ మెషీన్‌లోని వ్యక్తి మూడ్‌ను బట్టి మారిపోతుంటాయి. ఇక మనుషులకు స్నానం చేయించేందుకు వేగవంతమైన నీటి ధారలను ఉత్పత్తి చేసేత హైస్పీడ్ వాటర్ జెట్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ నీటి ధారల్లోని సూక్ష్మమైన బుడగలు చర్మానికి తాకగానే పేలిపోతాయి. ఈ క్రమంలో చర్మానికి అంటుకుని ఉన్న మురికి, ఇతర మలినాలు వదిలిపోతాయి. స్పాలో ఉన్నట్టు పూర్తిస్థాయిలో వ్యక్తులు రిలాక్సయ్యేలా దీన్ని ఏర్పాటు చేశారు.
Contagious Yawning: ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తారు! ఎందుకో తెలిస్తే..
నెట్టింట ఈ కాన్సెప్ట్ అనేక మందికి నచ్చింది. చివరకు స్నానం చేసేందుకు కూడా యంత్రాలు వస్తున్నాయంటే జపాన్ జనాలు సాంకేతికతలో ఎంత ముందున్నారో అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇవి వృద్ధాశ్రమాలకు బాగా పనికొస్తాయని కొందరు చెప్పారు. అన్నట్టు.. దీంట్లో స్నానం ఎలా ఉంటుందో జనాలకు పరిచయం చేసేందుకు కూడా కంపెనీ సిద్ధమైంది. ఎగ్జిబిషన్ సందర్భంగా రోజుకు ఇందులో ఏడుగురికి స్నానం చేసేందుకు అవకాశం ఇస్తామని పేర్కొంది. దీనికి దరఖాస్తు చేసుకున్న కస్టమర్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి హ్యుమన్ వాషింగ్ మెషీన్‌లో ఉపయోగించుకునే అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చింది. కమర్షియల్ అవసరాలకే కాకుండా ఇళ్లల్లో వాడుకునేందుకు కూడా ఓ మోడల్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పింది.
Updated Date - Dec 09 , 2024 | 06:38 PM