Viral: వెయ్యి ఇళ్ల తాళాలు పగలగొట్టి చొరబడ్డాడు.. ఎందుకని అడిగితే..
ABN, Publish Date - Dec 02 , 2024 | 09:48 PM
ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వెయ్యి ఇళ్లల్లోకి తాళాలు పగలగొట్టి చొరబడ్డాడు.. ఎందుకిలా అని పోలీసులు అడిగితే ఒత్తిడి తగ్గించుకునేందుకు అని చెప్పాడు. అతడి సమాధానం పోలీసులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ వింత ఉదంతం జపాన్‌లో వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వెయ్యి ఇళ్లల్లోకి తాళాలు పగలగొట్టి చొరబడ్డాడు.. ఎందుకిలా అని పోలీసులు అడిగితే ఒత్తిడి తగ్గించుకునేందుకు అని చెప్పాడు. అతడి సమాధానం పోలీసులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఈ వింత ఉదంతం జపాన్‌లో వెలుగు చూసింది (Viral).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఫకుకోవా ప్రావిన్స్‌లోని దజాఫూ ప్రాంతంలో నవంబర్ 25న రాత్రి వేళ ఓ వ్యక్తి ఓ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. ఆ ఇంట్లోని దంపతులకు ఈ అలికిడి కారణంగా మెళకువ వచ్చింది. ఏ జరిగిందా అని చూస్తే నిందితుడు లోపలికి ప్రవేశిస్తూ కనిపించాడు. దీంతో, హడలిపోయిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, నిందితుడు పోలీసులకు చిక్కాడు. అతిడిని ప్రశ్నించగా పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.
Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా! చడామడా విమర్శించిన నెటిజన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్
‘‘నాకు జనాల ఇళ్ల తాళాలు పగలగొట్టి చొరబడటం ఓ హాబీ. ఇప్పటివరకూ వెయ్యి ఇళ్లల్లోకి చొరబడ్డా. లోపలికి వెళుతున్నప్పుడు ఎవరైనా చూస్తారేమోనన్న ఉత్కంఠ నాకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చేతులకు చెమటలు పట్టడం, అలర్ట్ గా ఉండటం వంటివన్నీ ఒత్తిడి తగ్గిస్తాయి’’ అని అతడు చెప్పుకొచ్చాడు. అయితే, అతడు చొరబడ్డ ఇళ్లల్లో ఏ వస్తువూ చోరీకి గురికాకపోవడం ఓ కొసమెరపు. అయితే, అనుమతి లేకుండా ఇతరుల ఇళ్లల్లోకి ప్రవేశించిన నేరంపై పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Viral: జర్మనీలో ఇంజినీర్‌గా చేసి యాచకుడిగా మారిన వ్యక్తి! ఇతడి అసలు కథ ఇదా!
కాగా, జపాన్‌లో ఇటీవల వెలుగు చూసిన మరో ఉదంతం కూడా సంచలనం రేకెత్తించింది. ఆత్మహత్య చేసుకున్న ఓ యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 17 ఏళ్ల యువతి భవనంపై నుంచి దూకింది. ఈ క్రమంలో కింద నడిచి వెళుతున్న మరో మహిళపై పడటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ఆత్మహత్య చేసుకున్న యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మృతికి కారణమైనట్టు అభియోగం మోపారు. ఈ ఉదంతంపై యావత్ జపాన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల చర్య హాస్యాస్పదమని, వృథా ప్రయత్నమని జనాలు విమర్శలు గుప్పించారు.
Viral: యువతులతో కలిసి ఏనుగు భరతనాట్యం! జరిగింది తెలిస్తే కన్నీళ్లు ఆగవ్!
Updated Date - Dec 02 , 2024 | 09:51 PM