ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: జపాన్ వీధుల పరిశుభ్రతను పరీక్షించిన భారతీయ యువతి! రిజల్ట్స్‌ చూసి షాక్

ABN, Publish Date - Nov 12 , 2024 | 08:05 PM

జపాన్ వీధుల్లో పరిశుభ్రతను పరీక్షించిన ఓ యువతి ఫలితం చూసి షాకైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా జనాలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: జపాన్ అంటేనే ఆధునిక సాంకేతికతకు మారు పేరు. కానీ, అక్కడి ప్రజలు మాత్రం తమ సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో గౌరవమిస్తారు. సాంకేతికంగా ఎంతటి పురోగతి సాధించిన వారసత్వంగా వస్తున్న విలువలను పాటిస్తారు. ముఖ్యంగా వారు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు. ఫలితంగా జపాన్.. అత్యంత పరిశుభ్రమైన దేశాల్లో ఒకటిగా పేరుగాంచింది. అయితే, ఈ విషయాన్ని స్వయంగా పరీక్షించాలనుకుంది ఓ భారతీయ వనిత. ఇందుకు ఆమె ఎంచుకున్న పరీక్ష దాని ఫలితంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా పరీక్ష తాలూకు వీడియో మాత్రం నెట్టింట ప్రభంజనం సృష్టిస్తోంది (viral).

Viral: ప్రసవ సమయంలో డాక్టర్ల పొరపాటు.. 18 ఏళ్లుగా మహిళకు నరకం


పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యం ఇచ్చే జపనీయులు తమ పరిసరాలను ఎంతో క్లీన్‌గా ఉంచుకుంటారు. నలుగురూ నడిచే రహదారులు కూడా ఎవ్వరూ ఊహించని స్థాయిలో పరిశుభ్రంగా ఉంటాయని ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఈ విషయాన్ని స్వయంగా పరీక్షించదలిచిన సిమ్రన్ అనే యువతి తెల్ల సాక్సులు వేసుకుని వీధుల్లో నడిచింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, జపాన్‌లో ఎంత పరిశుభ్రత ఉందో పరీక్షించేందుకు తాను ఓ కొత్త పరీక్షను ఎంచుకున్నట్టు చెప్పుకుంది. ఇందు కోసం ఆమె తెల్లసాక్సులు కొని తొడుక్కుని వాటితోనే రద్దీ ఎక్కువగా ఉన్న వీధులు, కూడళ్లల్లో నడిచింది. కాసేపు అలా నడిచాక కాళ్లకున్న సాక్సులు చూపించింది. వాటిపై దుమ్మూ ధూళీ మరకలు లేవని చెప్పిన ఆమె.. ఈ ఫలితంగా తననూ షేక్ చేసిందని చెప్పింది. సాక్సులపై నడిచినా కూడా వాటిపై ఒక్క మరక కూడా లేకపోవడంతో జపాన్ పరిశుభ్రతకు తార్కాణంగా నిలుస్తోందని కామెంట్ చేసింది.

Viral: పెళ్లిలో వధూవరులకు భారీ షాక్! మా తప్పేంటో చెప్పండంటూ ఆవేదన


కానీ జనాలు మాత్రం ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు దీన్ని చూసి షాకైపోయారు. జపాన్‌లో రోడ్లు మరీ ఇంత శుభ్రంగా ఉంటాయా అని నోరెళ్లబెట్టారు. కొందరు మాత్రం పలు సందేహాలు వ్యక్తం చేశారు. మనుషులు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న చోట వీధులు ఇంత శుభ్రంగా ఉండటం నమ్మశక్యం కాదని అన్నారు. వీడియో ఎడిట్ చేసినట్టు ఉందని, ఆమె సాక్సులు తొడుక్కున చోటే మళ్లి వాటిని చూపించి పరీక్ష పూర్తి చేసిందని అన్నారు. ఆమె చెప్పే దాంట్లో నిజముండొచ్చని, నెట్టింట అసత్యాలు చెప్పే సాహసం ఎవరూ చేయలేరని కొందరు అన్నారు. జపాన్‌లో దుస్తుల డిటర్జెంట్ కంపెనీలు నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందని కొందరు సరదా వ్యాఖ్యలు చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది.

Viral: 8 కేజీల శనగపిండితో బూందీ చేసిన జర్మన్ మహిళ! వీడియో వైరల్

Updated Date - Nov 12 , 2024 | 08:12 PM