ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వామ్మో.. జూలో జింకకు ఎంత తెలివో చూడండి!

ABN, Publish Date - Nov 09 , 2024 | 10:07 PM

మనుషులకు అభివాదం చేస్తున్నట్టు కనిపిస్తున్న జింక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ జింక మహా తెలివి గలదని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అమాయకంగా కనిపించే జంతువుల్లో కూడా చాలా తెలివితేటలు దాగుంటాయి. అవసరమైన సందర్భాల్లో అవి ప్రదర్శించే తెలివితేటలు చూసి ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి జనాలు సరిగ్గా ఇవే కామెంట్స్ చేస్తున్నారు. వీడియోలోని జింక జీనియస్ అని తెగ పొగిడేస్తున్నారు. ఓ భారతీయ మహిళ జపాన్‌లో ఈ వీడియోను రికార్డు చేసి నెట్టింట పంచుకుంది. నేను ఇందుకే జపాన్‌కు వద్దామనుకుంటున్నా అంటూ ఆమె పెట్టిన కామెంట్ ఆసక్తికరంగా మారింది (Viral).

Viral: భర్తకు జాబ్ పోయిందని విడాకులిచ్చి.. 4 ఏళ్ల తరువాత ఊహించని విధంగా..


జపాన్‌ జనాలు అవతలివారికి నమస్కరించేటప్పుడు కాస్త ముందుకు వంగి అభివందనం తెలియజేస్తారన్న విషయం తెలిసిందే. ఈ వైరల్ వీడియోలోని జింక కూడా సరిగ్గా ఇదే చేస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, భారతీయ మహిళ జింక ముందు నిలబడి జపాన్ స్టైల్లో నమస్కరించగానే ఆమెను జింక కూడా అనుకరించింది. సరిగ్గా అలాగే మెడ ముందుకు వంచి ప్రతి నమస్కారం చేస్తున్నట్టు వ్యవహరించింది. ఆ తరువాత మహిళ అందించిన ఆహారాన్ని తీసుకుంది. ఇతర టూరిస్టులు ఎవరు దాని ముందు నమస్కరించినా వారిని అనుకరించి వారిచ్చిన ఆహారాన్ని తీసుకుంటోంది. ఈ వీడియోను షేర్ చేసిన భారతీయ మహిళ పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘జపాన్‌కు చెందిన నారా జింకను చూస్తే నిజంగా అద్భుతమని అనిపిస్తుంది. శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చేయడం ఈ జింక డీఎన్ఏలోనే ఉందని జనాలు అంటుంటారు. కానీ ఇలా తల వంచితే తమకు ఆహారం దక్కుతుందన్న విషయం అవి గుర్తించాయి. అందుకే ఇలా చేస్తుంటాయి. వీటి ప్రవర్తన వాస్తవానికి కుక్కలను పోలి ఉంటుంది. మియాజిమాలోని జింకలు ఇలా చేయవు’’ అని ఆమె చెప్పుకొచ్చింది.

4B Movement: అమెరికాలో మరో ఉద్యమం! పురుషులతో శృంగారానికి నో అంటున్న మహిళలు


ఇక వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వెల్లువెత్తాయి. జింకకు భలే మర్యాద తెలుసని కొందరు అన్నారు. జపాన్‌లో జంతువులు కూడా మర్యాదగానే ఉంటాయని మరికొందరు సరదా వ్యాఖ్య చేశారు. ఈ వీడియో చూశాక తమకూ జపాన్ వెళ్లాలని ఉందని అన్నారు.

ఇక ఈ జింకలను స్థానికులు పవిత్రమైన జీవాలుగా చూస్తారు. షింటో భగవానుడు ఈ జింకను అధిరోహించి నారా ప్రాంతానికి చేరుకున్నాడు కాబట్టి ఈ జింకలు పవిత్రమైనవిగా గుర్తింపు పొందాయి. వీటిని దేవదూతలుగా స్థానికులు భావిస్తారు. వీటిని వేటాడటం జపాన్‌లో నిషిద్ధం. కొన్ని వేల ఏళ్లుగా ఈ నిషేధం అమలవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Nov 09 , 2024 | 10:31 PM