ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: సార్.. నాకు ఉద్యోగం ఉంటేనే నా లవర్ పెళ్లికి ఒప్పుకుంటుంది.. మేనేజర్‌కు వింత విన్నపం!

ABN, Publish Date - Jun 15 , 2024 | 01:31 PM

ఉద్యోగం సంపాదించడం అంత తేలిక కాదు. రెజ్యూమ్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంతో పాటు ఇంటర్వ్యూ‌లో సరైన సమాధానాలు చెబితేనే ఉద్యోగం వస్తుంది. రెజ్యూమ్‌లో అభ్యర్థులు తమ అర్హతలను, పనితీరను వివరిస్తారు. తాము ఆ ఉద్యోగానికి ఎలా సరిపోతామో, ఆ ఉద్యోగం తమకు ఎందుకు అవసరమో వీలైనంత వివరంగా పేర్కొంటారు.

Funny resume

ఉద్యోగం (Job) సంపాదించడం అంత తేలిక కాదు. రెజ్యూమ్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంతో పాటు ఇంటర్వ్యూ‌లో సరైన సమాధానాలు చెబితేనే ఉద్యోగం వస్తుంది. రెజ్యూమ్‌ (Resume)లో అభ్యర్థులు తమ అర్హతలను, పనితీరను వివరిస్తారు. తాము ఆ ఉద్యోగానికి ఎలా సరిపోతామో, ఆ ఉద్యోగం తమకు ఎందుకు అవసరమో వీలైనంత వివరంగా పేర్కొంటారు. అయితే కొందరు విభిన్న సమాధానాలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బెంగళూరు (Bengaluru)కు చెందిన ఓ కంపెనీ సీఈవోకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.


బెంగళూరుకు చెందిన ఆర్వా హెల్త్ (Arva Health) కంపెనీ ఇటీవల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో చాలా మంది కంపెనీకి రెజ్యూమ్‌లు పంపించారు. అందులో ఓ అభ్యర్థి రెజ్యూమ్ చూసి కంపెనీ హెచ్‌ఆర్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. సదరు అభ్యర్థి రెజ్యూమ్‌లో తన అర్హతలతో పాటు తనకే ఆ జాబ్ ఇవ్వాల్సిన ఆవసరాన్ని కూడా వివరించాడు. ``సార్ ఈ ఉద్యోగం కనుక రాలేదంటే నా చిన్ననాటి ప్రియురాలు నాకు దూరమవుతుంది. ఆమెను పెళ్లిచేసుకోలేను``అంటూ వేడుకున్నాడు. ఇది చూసి ఆ కంపెనీ సీఈవో కూడా ఆశ్చర్యపోయారు.


ఉద్యోగం ఉంటేనే పెళ్లి (Marriage)కి అంగీకరిస్తానని తన ప్రియురాలి (Girl Friend) తండ్రి కండీషన్ పెట్టినట్టు పేర్కొన్నాడు. ఆ రెజ్యూమ్ చూసిన కంపెనీ హెచ్ఆర్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫన్నీ పోస్ట్‌ను ఇప్పటివరకు 2.2 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆ ఉద్యోగం ఆ క్యాండిడేట్‌కే ఇవ్వాలని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేయడం కొసమెరుపు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. వరుసగా రోడ్డుపై పడిపోయిన బైకర్లు.. అసలేం జరిగిందంటే..


Viral Video: ఆ ఏనుగు తెలివికి హ్యాట్సాఫ్.. చెట్టు మీద పనస పళ్లను ఎలా తెంపిందో చూడండి.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2024 | 01:31 PM

Advertising
Advertising