ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: యూట్యూబ్‌లో వీడియో చూసి పేషెంట్‌కు ఈసీజీ పరీక్ష!

ABN, Publish Date - Nov 02 , 2024 | 02:30 PM

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోగల ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి యూట్యూబ్ చూస్తూ పేషెంట్‌కు ఈసీజీ పరీక్ష నిర్వహించిన వైనం వివాదాస్పదంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోగల ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి యూట్యూబ్ చూస్తూ పేషెంట్‌కు ఈసీజీ పరీక్ష నిర్వహించిన వైనం వివాదాస్పదంగా మారింది. పట్వా ఆసుపత్రిలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది (Viral).

ఆసుపత్రి స్టాఫ్ ఒకరు యూట్యూబ్ వీడియో చూస్తూ పరీక్ష చేసేందుకు ప్రయత్నించగా రోగి బంధువులు అడ్డుకున్నారు. ఇదేంటని నిలదీశారు.

Viral: యాచకురాలికి దీపావళి నాడు కండోమ్ ఇచ్చిన డాక్టర్!


గుండె పనితీరును అంచనా వేసేందుకు ఈసీజీ తీస్తారన్న విషయం తెలిసిందే. గుండెలో నొప్పిగా ఉందని రోగి ఫిర్యాదు చేసిన వెంటనే ముందు ఈ పరీక్ష నిర్వహిస్తారు. హార్ట్ అటాక్, క్లాట్స్, వంటి సీరియస్ రోగాలు ఉన్నదీ లేనిదీ ఈసీజీలో తెలిసిపోతుంది.

Viral: ఈ శిశువు మృత్యుంజయుడు! తల్లిదండ్రులు వంతెనపై నుంచి విసిరేస్తే..


ఇంతటి కీలకమైన పరీక్షను సదరు సిబ్బంది యూట్యూబ్‌లో చూసి చేసేందుకు ప్రయత్నించడంతో రోగి బంధువులు ఆశ్చర్యపోయారు. ఇదేంటని ప్రశ్నిస్తే తాను గతంలో ఈసీజీ ఎన్నడూ తీయలేదని, తాను అసలు ల్యాబ్ అసిస్టెంట్ కానేకాదని చెప్పుకొచ్చాడు. ఇదంతా చెప్పాక కూడా అతడు యథాప్రకారం, రోగి బంధువుల అభ్యంతరాలను తోసి పుచ్చుతూ ఈసీజీ తీశాడు. దీంతో, ఈ ఉదంతం కలకలానికి దారి తీసింది. నెట్టింట కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు ఇంకా స్పందించాల్సి ఉంది.

Read Latest and Viral News

Updated Date - Nov 02 , 2024 | 02:35 PM