Viral Video: ఐరన్ బాక్స్ లేకపోతేనేం.. తెలివి ఉంది కదా.. ఓ వ్యక్తి షర్ట్‌ను ఎలా ఇస్త్రీ చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:08 PM
కొందరు అవసరమైన వస్తువు లేనపుడు అందుబాటులో ఉన్న వస్తువులను పని పూర్తి చేసుకుంటారు. ఆ క్రమంలో వారు అద్భుతమైన తెలివితేటలను వాడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మన దేశంలో చాలా మంది వ్యక్తులు కష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. అవసరమైన వస్తువు లేనపుడు అందుబాటులో ఉన్న వస్తువులను పని పూర్తి చేసుకుంటారు. ఆ క్రమంలో వారు అద్భుతమైన తెలివితేటలను (Intelligence) వాడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి కరెంట్, ఐరన్ బాక్స్ (Iron Box) లేకుండానే తన షర్ట్‌ను ఇస్త్రీ చేసుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
shadabjakati1 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన ఇంట్లో ఓ షర్ట్‌ను ఇస్త్రీ చేస్తున్నాడు. అయితే అతడి దగ్గర ఐరన్ బాక్స్ లేదు. దీంతో అతడు వెరైటీగా తన షర్టుకు ఇస్త్రీ చేస్తున్నాడు. టీ కాచుకునే పాత్రలో మంట పెట్టాడు. ఆ మంట కారణంగా ఆ పాత్ర వేడెక్కింది. మంట ఉండగానే ఆ పాత్రతో ఆ వ్యక్తి తన షర్ట్‌ను ఇస్త్రీ చేసుకున్నాడు. ఆ షర్ట్ చక్కగా ఐరన్ అవుతోంది. అతడి తెలివితేటలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. 24 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``థ్యాంక్స్ బ్రదర్.. మంచి ఐడియా ఇచ్చినందుకు``, ``కరెంట్‌ను కనిపెట్టకముందు బట్టలను ఇలాగే ఐరన్ చేసుకునేవారేమో``, ``గొప్ప ఆలోచన``, ``మంట ఎక్కువైతే షర్ట్ కాలిపోతుంది``, ``కరెంట్‌ను ఆదా చేయడానికి ఇది మంచి ఆలోచన`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Shocking: ఇదెక్కడి విచిత్రం.. పక్షి కడపులో నుంచి బయటపడుతున్న చేప.. అసలేం జరిగిందంటే..
Viral News: బెడ్‌షీట్‌పై కాఫీ చుక్కలు.. కస్టమర్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన హోటల్ సిబ్బంది..
Viral News: ఉల్లిపాయ అడిగిన డెలివరీ బాయ్.. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి