ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dangerous creatures: అత్యంత ప్రమాదకరమైన సముద్రపు జీవులు తెలుసా.. ఇవి కుట్టాయంటే..

ABN, Publish Date - Oct 18 , 2024 | 11:18 AM

సముద్రాల లోతుల్లో అనేక జీవులు నివసిస్తూ ఉంటాయి. డాల్ఫిన్ వంటివి మనుషులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటే మరికొన్ని మాత్రం అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. అవి కనిపించినప్పుడు వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెప్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మాంసాహారాన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అందులోనూ సీ ఫుడ్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి రోజూ వివిధ దేశాల్లో టన్నుల కొద్ది చేపలను వేటాడుతుంటారు. అందులో అనేక రకాల చేపలు ఎంతో రుచికరంగానూ, వేల రూపాయల ఖరీదు కూడా ఉంటాయి. అయితే భూమ్మీద పాము, తేలు సహా పలు రకాల విషపూరిత జీవులు లాగే సముద్రాల్లోనూ అలాంటివి ఉంటాయి. అయితే భూమ్మీద ఉండే వాటి కంటే ఇవి మరీ ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ జీవులు ఏంటి, వాటి వివరాలు తెలుసుకుందాం..


సముద్రాల లోతుల్లో అనేక జీవులు నివసిస్తూ ఉంటాయి. డాల్ఫిన్ వంటివి మనుషులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటే మరికొన్ని మాత్రం అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. అవి కనిపించినప్పుడు వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెప్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు వీటిని గుర్తించి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


1. స్టోన్ ఫిష్

ఈ స్టోన్ ఫిష్ అనేది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేప. చూసేందుకు అచ్చం రాయిలా కనిపిస్తుండడంతో దానికి స్టోన్ ఫిష్ అనే పేరు వచ్చింది. దీని వెనకభాగంలో అత్యంత విషపూరితమైన వెన్నుముకలు ఉంటాయి. ఇవి శక్తిమంతమైన టాక్సిన్ విడుదల చేస్తాయి. ఈ చేప మనకు చాలా హాని కలిగించగలదు.

2. లయన్ ఫిష్

లయన్ ఫిష్ అనేది శరీరం చుట్టూ ముళ్లను కలిగి ఉంటుంది. ఇది చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అలాగని ముట్టుకుంటే మాత్రం ఇక అంతే సంగతి. దీని శరీరం చుట్టూ ఉండే ముళ్లు చాలా ప్రమాదకరం. అవి విషపూరితం కూడా. ఇది కుట్టిందంటే విపరీతమైన నొప్పితో అల్లాడిపోతారు.

3. బాక్స్ జెల్లీ ఫిష్

బాక్స్ జెల్లీ ఫిష్ అనేది నిమిషాల్లోనే మనిషిని చంపేయగలదు. ఈ చేప అత్యంత ప్రమాదం కలిగించగలదు. బాక్స్ జెల్లీ ఫిష్ టెంటకిల్స్‌లో ప్రమాదకరమైన విషం ఉంటుంది. ఇది కుట్టిందంటే తీవ్రమైన నొప్పి కలుగుతుంది. నిమిషాల్లోనే విషం రక్తంలో చేరి గుండె ఆగిపోయేలా చేసి తద్వారా మరణించేలా చేస్తుంది. అలాగే పక్షవాతం కలిగించగలదు. దీన్ని పట్టుకునే ప్రయత్నం అస్సలు చేయెుద్దు.

4. కోన్ నత్త

శంకువు నత్తలు చిన్నవిగా, హాని కనిగించని వాటిలా కనిపిస్తాయి. నిజానికి ఇవి ప్రాణాంతకం. కోన్ నత్తలు ఎక్కువగా వెచ్చని నీటిలో కనిపిస్తాయి. వీటి దంతాల్లో విషం ఉంటుంది. వీటిని పట్టుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి కరవడం ద్వారా విషాన్ని శరీరంలోకి పంపి పరిస్థితిని ప్రాణాంతకంగా మార్చగలవు.

5. పోర్చ్‌గీస్ మ్యాన్ ఓ వార్

పోర్చ్‌గీస్ మ్యాన్ ఓ వార్ అనేది చూసేందుకు జల్లీ ఫిష్, పీత రెండింటి మిశ్రమాన్ని తలపిస్తుంది. ఇవి కొంచెం పొడవుగా ఉంటాయి. ఇవి కుట్టడం ద్వారా తీవ్రబాధ, నొప్పి కలుగుతాయి.

6. సముద్రపు పాము

సముద్రపు పాములు ప్రపంచంలో అత్యంత విషపూరితమైనవి. ఇవి కరిచాయంటే కండరాల పక్షవాతం వస్తుంది. అలాగే వీటి విషం శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాలు పోయేలా చేయగలదు. సరైన సమయంలో వైద్యం అందకపోతే పరిస్థితులు దిగజారిపోయి ప్రాణాలు పోవచ్చు.

7. ఇరుకండ్జీ జల్లీ ఫిష్

ఇరుకండ్జీ జెల్లీ ఫిష్ అనేది చూసేందుకు చిన్నగా కనిపించినప్పటికీ చాలా ప్రమాదకరం. దీని స్టింగ్ ఇరుకండ్జీ సిండ్రోమ్‌కు కారణమవుతుంది. ఇది కుట్టిందంటే వాంతులు అవుతాయి. గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటుంది. అలాగే తీవ్రమైన నొప్పి, ముఖ్యంగా మనకు ప్రాణం లేదనే కొత్త అనుభూతి కలిగిస్తుంది.

8. బ్లూ రింగ్డ్ ఆక్టోపస్

బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ అనేది పాముల కంటే ప్రమాదకారి. ఇది భూమ్మీద ఉన్న పాముల కంటే ఎక్కువ శక్తిమంతమైన విషాన్ని కలిగి ఉంటుంది. దీని విషంలో టెట్రోడోటాక్సిన్ అనేది ఉంటుంది. ఈ విషం మనుషుల శ్వాసకోశ వ్యవస్థను నిమిషాల్లో దెబ్బతీసి మనుషులు చనిపోయేలా చేయగలదు. అలాగే పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పరిమాణంలో చిన్నగా ఉందని చులకనగా చూసి మోసపోవద్దు.


ఈ వార్తలు కూడా చదవండి:

Viral Video: కామ్‌గా ఉన్న ఎద్దును కెలికితే ఇలాగే ఉంటుంది మరీ.. వీడియో చూస్తే పగలబడి నవ్వాల్సిందే..

Viral Video: స్టెతస్కోప్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ వైద్య విద్యార్థి తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Oct 18 , 2024 | 11:18 AM