ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జస్ట్‌ మిస్‌..

ABN, Publish Date - Oct 06 , 2024 | 10:38 AM

‘‘..జాగ్రత్త.. జాగ్రత్త..మెల్లగా దించండి..’’ జాకీ డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు సోదరులు ఇయాన్‌, స్టువర్ట్‌ పాటన్‌. వారి యాభై ఏళ్ల కల అది! అందుకే అంత టెన్షన్‌. ఇంతకూ విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద గుమ్మడికాయను పండించి రికార్డు బద్దలుకొట్టాలన్నది సోదరుల లక్ష్యం.

‘‘..జాగ్రత్త.. జాగ్రత్త..మెల్లగా దించండి..’’ జాకీ డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు సోదరులు ఇయాన్‌, స్టువర్ట్‌ పాటన్‌. వారి యాభై ఏళ్ల కల అది! అందుకే అంత టెన్షన్‌. ఇంతకూ విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద గుమ్మడికాయను పండించి రికార్డు బద్దలుకొట్టాలన్నది సోదరుల లక్ష్యం. అందుకోసం తెచ్చిందే ఈ పేద్ద గుమ్మడి. వీరిద్దరూ ఈ పంటను ఇంగ్లండ్‌లో సాగు చేసే రైతులు. ప్రపంచంలోని అత్యంత బరువున్న గుమ్మడి 1247 కిలోలు. ఎలాగైనా సరే ఆ రికార్డును బద్దలు కొట్టాలన్న పట్టుదలతో .. ఇదిగో ఈ కాయని కష్టపడి పండించారు.


ఆఖరికి మార్కెట్‌కు తీసుకొచ్చారు. అధికారుల సమక్షంలో బరువు ఎంత తూగుతుందో.. రికార్డు బ్రేక్‌ అవుతుందో లేదోనన్న టెన్షన్‌. గుమిగూడిన ప్రజల మధ్యలో తూకం వేశారు. 1246.6 కిలోలే ఉంది. కేవలం నాలుగువందల గ్రాములు తక్కువంతే! అందుకే ప్రపంచంలోనే పెద్ద గుమ్మడికాయ రికార్డును బద్దలుకొట్టలేకపోయింది. ‘‘అయినా సరే.. మేం వెనకడుగువేయం. మళ్లీ మరో సీజన్‌లో అతి భారీ గుమ్మడిని పండించి రికార్డు కొడతాం’’ అంటున్నారీ సోదరులు.

Updated Date - Oct 06 , 2024 | 10:38 AM