Zakir Hussain: అద్భుతమైన క్షణం.. జాకీర్ హుస్సేన్ చివరి పోస్ట్ వైరల్..
ABN, Publish Date - Dec 16 , 2024 | 12:04 PM
మూడేళ్లకే తబాలాపై చేతులేసి, ఏడళ్లకే స్టేజ్ షో ప్రారంభించి, 12 ఏళ్లకు అంతర్జాతీయ ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది అభిమానులను సంపాదించికున్న జాకీర్ హుస్సేన్ ఆరు దశాబ్దాల పాటు అభిమానులను అలరించారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జాకీర్ హుస్సేన్ తరచుగా పోస్ట్‌లు చేస్తుంటారు.
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.. పద్మవిభూషణ్ పురస్కారగ్రహీత.. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) (Zakir Hussain) కన్ను మూశారు. అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన రెండువారాలుగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మూడేళ్లకే తబాలాపై చేతులేసి, ఏడళ్లకే స్టేజ్ షో ప్రారంభించి, 12 ఏళ్లకు అంతర్జాతీయ ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది అభిమానులను సంపాదించికున్న జాకీర్ హుస్సేన్ ఆరు దశాబ్దాల పాటు అభిమానులను అలరించారు (Zakir Hussain's Last Instagram Post ).
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే జాకీర్ హుస్సేన్ తరచుగా పోస్ట్‌లు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన చేసిన చివరి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో అమెరికాలోని తన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటూ చుట్టు పక్కల ప్రకృతిని స్వయంగా చిత్రీకరించారు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ``అద్భుతమైన క్షణం`` అంటూ కామెంట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన జాకీర్ హుస్సేన్ మృతికి ఎంతో మంది ప్రముఖులు నివాళులర్పించారు.
హిందుస్థానీ క్లాసికల్, జాజ్ ఫ్యూజన్‌లో నైపుణ్యం సాధించి ప్రపంచ వేదికలపై వాటిని ప్రదర్శించారు. 1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ పురస్కారం, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. ఈ ఏడాది 66వ గ్రామీ అవార్డుల వేడుకలో మూడు అవార్డులను అందుకున్నారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Dec 16 , 2024 | 12:04 PM