Viral Video: పారాగ్లైడర్‌కు ఊహించని షాక్.. నేల పైకి క్షేమంగా దిగాడు కానీ.. తీరా చూస్తే...
ABN, Publish Date - Jan 10 , 2024 | 08:29 PM
పారాగ్లైడింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ కొందరు అంత ధైర్యం లేక వెనకడుగు వేస్తుంటారు. అయితే చాలా మంది స్కైడైవింగ్, పారాగ్లైడింగ్‌లో చిత్రవిచిత్ర సాహసాలు చేస్తుంటారు. అయితే...
పారాగ్లైడింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ కొందరు అంత ధైర్యం లేక వెనకడుగు వేస్తుంటారు. అయితే చాలా మంది స్కైడైవింగ్, పారాగ్లైడింగ్‌లో చిత్రవిచిత్ర సాహసాలు చేస్తుంటారు. అయితే ఇవి కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పారాగ్లైడర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. నేలపైకి క్షేమంగా దిగాడు కానీ.. తీరా కిందకు వచ్చాక ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్ పారాగ్లైడర్ (Australian paraglider) అయిన జోనాథన్ బిషప్ ఇటీవల పారాగ్లైడింగ్‌కు వెళ్లాడు. ఆకాశంలో విహరించిన అనంతరం నమద్గి నేషనల్ పార్క్ పరిధి ఓర్రోరల్ వ్యాలీలో దిగేందుకు ప్రయత్నించాడు. అందుకు తగ్గట్టుగానే ఆకాశం నుంచి క్షేమంగా కిందకు దిగాడు. అయితే తీరా నేలపై ల్యాండ్ అయ్యే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నేలపై అడుగుపెట్టగానే అతన్ని దూరం నుంచి గమనించిన రెండు కంగారూలు (Kangaroos) .. పారాగ్లైడర్ వద్దకు కోపంగా వచ్చాయి.
వాటిలో ఓ కంగారు పారాగ్లైడర్ వద్దకు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేసింది. సడన్‌గా కంగారు దాడి చేయడంతో షాక్ అయిన అతను.. గట్టిగా అరుస్తూ దాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేస్తాడు. దీంతో చివరకు కంగారు భయపడిపోయి అతడి వద్ద నుంచి దూరంగా పారిపోతుంది. కంగారు వెళ్లిపోవడంతో అతను హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకుంటాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘పారాగ్లైడర్ టైం ఎంతో బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - Jan 10 , 2024 | 08:29 PM