ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kanniyakumari: కన్నియాకుమారిలో గుహన్‌ బోట్‌ ట్రయల్‌ రన్‌..

ABN, Publish Date - Apr 26 , 2024 | 12:12 PM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో పూంపుహార్‌ సంస్థ నడుపుతున్న మూడు బోట్లలో ఒకటైన గుహన్‌ బోట్‌ ట్రయల్‌ రన్‌ శుక్రవారం ఉదయం జరిగింది.

చెన్నై: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో పూంపుహార్‌ సంస్థ నడుపుతున్న మూడు బోట్లలో ఒకటైన గుహన్‌ బోట్‌ ట్రయల్‌ రన్‌ శుక్రవారం ఉదయం జరిగింది. కన్నియాకుమారి సముద్రతీర ప్రాంతంలో ఉన్న వివేకానంద స్మారక మండపం, తిరువళ్లువర్‌ విగ్రహ ప్రాంతానికి పొదిగై, గుహన్‌, వివేకానంద పేర్లతో మూడు బోట్లను పూంపుహార్‌ సంస్థ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మూడు బోట్లలో ఒకటైన గుహన్‌ రిపేరు కావటంతో ఫిబ్రవరి 15న దానిని చిన్నముట్టం షిప్పింగ్‌ యార్డ్‌కు తరలించారు. రెండు నెలల పాటు ఆ బోట్‌ మరమ్మతులు జరిగాయి.

ఇదికూడా చదవండి: Politics: ఓబీసీ రిజర్వేషన్లు తొలగించామనేది పచ్చి అబద్ధం.. మోదీపై విరుచుకుపడిన సిద్ధరామయ్య

ఈ నెల 15న కొత్త రూపు సంతరించుకున్న గుహన్‌ బోట్‌ను చిన్నముట్టం షిప్పింగ్‌ యార్డు నుంచి కన్నియాకుమారి వివేకానంద స్మారక మండపం సమీపంలో ఉన్న బోట్‌సవారీ కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత చెన్నై నుంచి వచ్చిన ఇంజనీర్లు, పూంపుహార్‌ సంస్థ అధికారులు గుహన్‌ బోట్‌(Guhan Boat)ను వివేకానంద స్మారక మండపం, తిరువళ్లువర్‌ విగ్రహ ప్రాంతం వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఆ బోట్‌ పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇక రోజూ ఆ బోట్‌ను పర్యాటకుల కోసం ఉపయోగించవచ్చని చెన్నై ఇంజనీరింగ్‌ నిపుణులు కూడా ప్రకటించారు. దీంతో శనివారం నుంచి ఈ బోట్‌ మళ్ళీ యధావిధిగా పొదిగై, వివేకానంద బోట్లతోపాటు పర్యాటకులకు సేవలందించనుందని అధికారులు పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Delhi: వీవీప్యాట్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు.. వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించవద్దని హితవు

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 12:12 PM

Advertising
Advertising