Viral: 15 ఏళ్లుగా లాటరీ టిక్కెట్ల కొనుగోలు! ఎట్టకేలకు అదృష్టం కలిసొచ్చి..
ABN, Publish Date - Oct 13 , 2024 | 08:40 AM
అదృష్టం కోసం ఓపిగ్గా ఎదురు చూసిన ఓ వ్యక్తి చివరకు కాలం కలిసొచ్చింది. అతడిని రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని చేసింది. ఇటీవల ఓ మెకానికి కేరళ తిరువోనమ్ బంపర్ లాటరీ గెలిచాడు. ఏకంగా రూ. 25 కోట్లు గెలుచుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం కోసం ఓపిగ్గా ఎదురు చూసిన ఓ వ్యక్తి చివరకు కాలం కలిసొచ్చింది. అతడిని రాత్రికి రాత్రి కోటీశ్వరుడిని చేసింది. ఇటీవల ఓ మెకానికి కేరళ తిరువోనమ్ బంపర్ లాటరీ గెలిచాడు. ఏకంగా రూ. 25 కోట్లు గెలుచుకున్నాడు. కర్ణాటకకు చెందిన అల్తాఫ్ గత పదిహేనేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటూనే ఉన్నాడు. ఇటీవల కూడా అలవాటు ప్రకారం వయనాడ్‌లోని సుల్తాన్ బాతరీలో టీజీ 434222 నెంబర్ గల టిక్కెట్టు కొన్నాడు. ఆ తరువాత తన టిక్కెట్టుకు బంపర్ లాటరీ తగిలిందని తెలిసి అతడి ఆనందం అంబరాన్ని అంటింది (Kerala).
Viral: నడిరోడ్డుపై పోలీసును నిలదీసిన బైకర్.. షాకింగ్ వీడియో!
తాను లాటరీలో గెలిచానని బంధువులకు చెప్పగా వారు నమ్మలేదని అల్తాఫ్ పేర్కొన్నాడు. టీవీలో స్క్రోల్ అవుతున్న తన లాటరీ టిక్కెట్టు నెంబర్ తాలూకు స్క్రీన్ షాట్ వారికి షేర్ చేస్తే అది చూసి ఆశ్చర్యపోయారని చెప్పాడు. కాగా, అల్తాఫ్ ఆనందానికి పట్టపగ్గాల్లేవని అతడికి లాటరీ టిక్కెట్ విక్రయించిన సబ్ ఏజెంట్ నాగరాజ్ పేర్కొన్నాడు. ఈ టిక్కెట్‌ను తాను ఎస్‌జే లక్కీ సెంటర్ ఏఎమ్ జీనేశ్‌ను తీసుకొన్నట్టు చెప్పాడు. ఈ నేపథ్యంలో సెల్లింగ్ ఏజెంట్ అయిన జీనేశ్‌కు రూ.25 లక్షలు, సబ్ ఏజెంట్ అయిన నాగరాజ్‌కు రూ.2.25 లక్షలు అందుతాయని తెలుస్తోంది.
Viral: ఈ సంస్థలో ఉద్యోగులందరికీ ఏకంగా 9 రోజుల లీవ్! రిలాక్స్ అయ్యేందుకట!
కాగా, తిరువనంతపురంలోని గోర్ఖీ భవన్‌లో నిర్వహించిన ఈ లాటరీ డ్రాను రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీకే ప్రశాంత్, లాటరీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అబ్రహామ్ రెన్ కూడా హాజరయ్యారు.
Updated Date - Oct 13 , 2024 | 08:42 AM