ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: సమంత తరువాత మరో ప్రముఖ వ్యక్తిని టార్గెట్ చేసుకున్న ‘ది లివర్ డాక్’!

ABN, Publish Date - Jul 08 , 2024 | 07:36 PM

హైడ్రోజన్ పెరాక్సైడ్ చికిత్స గురించి చెప్పినందుకు సమంతను విమర్శించిన ది లివర్ డాక్ తాజాగా మరో ప్రముఖుడిని టార్గెట్ చేసుకున్నాడు. పరిమితంగా మద్య పానం ఆరోగ్యానికి మంచిదన్న జెరోధా సంస్థ సహవ్యవస్తాపకుడిని దుయ్యబట్టారు.

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట ది లివర్ డాక్‌గా చిరపరిచితుడైన కేరళ వైద్యుడు డా. సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ సినీనటి సమంతపై విమర్శలు గుప్పించి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన తాజాగా ఓ వ్యాపారవేత్తపై విమర్శలు గుప్పించారు. మద్యం ఇండస్ట్రీని ప్రశంసించిన జెరోధా సంస్థ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌పై ఆయన గయ్యిమన్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్ గా (Viral) మారింది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిఖిల్ కామత్‌కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా, ఆయన ఇటీవల ‘భారత్‌లో మద్యం వ్యాపారం విలువ 70 బిలియన్ డాలర్లు’ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఇతర వ్యాపారవేత్తలు పాల్గొన్న ఈ షోలో కామత్ మాట్లాడుతూ మద్యం ఇండస్ట్రీ స్థాయిని చూసి అబ్బురపడ్డారు. మద్య నిషేధం విధించిన దేశాలు దివాలా అంచుల వరకూ వెళ్లాయన్నారు. మద్యం పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కూడా చెప్పుకొచ్చారు. ఇదిగో ఇక్కడే ఆయన లివర్ డాక్‌కు దొరికిపోయారు (Kerala Doctor Reacts Sharply To Nikhil Kamath's Podcast On Alcohol Industry).

Viral: ఇండియా బెటరా లేక విదేశాలా? పెద్ద చర్చకు తెరతీసిన యువతి కామెంట్!


నిఖిల్ కామత్‌ది బాధ్యతారాహిత్యమంటూ డా. ఫిలిప్స్ మండిపడ్డారు.మద్యం వ్యసనం కారణంగా లివర్ పాడైన ఎందరో పేషెంట్లను తాను వైద్యం చేశానని చెప్పుకొచ్చారు. ఈ దురలవాటు వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసిందన్నారు. పరిమిత స్థాయిలో మద్యం ఆరోగ్యానికి మంచిదన్న భావన కూడా తప్పని చెప్పారు. ఆరోగ్యానికి సంబంధించి ఇదో తప్పుడు సమాచారమని చెప్పుకొచ్చారు. మద్యం ఎంత మొత్తంలో తీసుకున్నా ఆరోగ్యానికి హాని కలుగుతుందని స్పష్టం చేశారు.

‘‘సరే.. ఆల్కహాల్ వ్యాపారం మంచిదే. ఇతరుల నుంచి డబ్బు జలగలా పీల్చేస్తుంది. పన్నులు, వ్యాపార గుత్తాధిపత్యం కారణంగా ప్రభుత్వానికి ఇది లాభసాటి వ్యవహారమే. ఇక మద్యం వ్యాపారస్తుల బ్యాంకు అకౌంట్లు నింపుతుంది. కానీ ఈ వ్యాపారులు మద్యం ఆరోగ్యానికి మంచిదంటూ ఆకాశానికెత్తేయడం వైద్యశాస్త్ర పరంగా తప్పుడు సమాచార వ్యాప్తి అవుతుంది. పరిమితంగా మద్యం తాగడం మంచిదనే మాట ఎక్కడ వినిపించినా నేను ఖండిస్తుంటాను. ఇదంతా చెత్త’’ అని తేల్చి పారేశారు.

డబ్బున్నోళ్లు మద్యం కారణంగా అనారోగ్యం పాలైనా చికిత్స తీసుకునే ఆర్థిక స్థామత వారికి ఉంటుందని, సామాన్యుల పరిస్థితి మాత్రం నరకప్రాయంగా మారుతుందని అన్నారు. ‘‘పరిమిత స్థాయిలో మద్యం ఆరోగ్యానికి మంచిదనడం నేరం, మొత్తం మానవాళికి చేసిన నేరం. ఒక్కసారి మద్యం రుచి చూశాక క్రమంగా దానికి బానిసైపోతారు’’ అని హెచ్చరించారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 08 , 2024 | 07:45 PM

Advertising
Advertising
<