Viral: గాల్లో ఉండగా విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. సిబ్బంది వారిస్తున్నా వినకుండా..
ABN, Publish Date - Jun 03 , 2024 | 01:56 PM
కేరళకు చెందిన ఓ వ్యక్తి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో హల్‌చల్ చేశాడు. తోటి ప్రయాణికులను, క్యాబిన్ సిబ్బందిని హడలెత్తించాడు. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. భయపడిన సిబ్బంది విమానాన్ని ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
కేరళ (Kerala)కు చెందిన ఓ వ్యక్తి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో (Air India Flight) హల్‌చల్ చేశాడు. తోటి ప్రయాణికులను, క్యాబిన్ సిబ్బందిని హడలెత్తించాడు. ఎమర్జెన్సీ డోర్ (Emergency door,) తెరిచేందుకు ప్రయత్నించాడు. భయపడిన సిబ్బంది విమానాన్ని ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు (Mumbai Airport). ముంబై పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కోజికోడ్ నుంచి బహ్రెయిన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కేరళకు చెందిన అబ్దుల్ ముసావిర్ నడుకండీ కోజికోడ్ (Kozhikode)లో విమానం ఎక్కి నిద్రపోయాడు. విమానం టేకాఫ్ కాగానే మేల్కొని విమానం వెనుక భాగం వైపు వెళ్లాడు. అక్కడ ఉన్న క్యాబిన్ సిబ్బందిపై దాడి చేసి విమానం డోర్ తెరవడానికి ప్రయత్నించాడు. సిబ్బంది అతడికి నచ్చ చెప్పి తిరిగి అతడిని సీట్ వద్దకు తీసుకెళ్లారు. అయినా అతను శాంతించకుండా ఇతర ప్రయాణీకులపై గొడవకు దిగి దాడి చేయడం ప్రారంభించాడు. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు.
అతడి ప్రవర్థన కారణంగా భద్రతాపరమైన ముప్పు ఉంటుందని భయపడిన విమాన సిబ్బంది ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. భద్రతా అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 336 (ప్రాణానికి హాని కలిగించే చట్టం), 504 (శాంతికి భంగం కలిగించేలా రెచ్చగొట్టడం), 506 (నేరపూరిత బెదిరింపు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), విమాన సంబంధిత నిబంధనల కింద కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: ఇంట్లోకి దూరి దొంగతనం చేశాడు.. ఏసీ ఆన్ చేసి నిద్రలోకి జారుకున్నాడు.. పోలీసులు నిద్రలేపితే..
Puzzle: ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను ఐదు సెకెన్లలో కనిపెట్టగలరేమో ప్రయత్నించండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 03 , 2024 | 01:56 PM