Viral: కారులో స్విమ్మింగ్ పూల్.. యూట్యూబర్‌పై కేసు
ABN, Publish Date - May 30 , 2024 | 10:35 PM
కారులో స్విమ్మింగ్ పూల్ ఏర్పాట చేసి ప్రమాదకర నిర్లక్ష్యం ప్రదర్శించిన కేరళ యూట్యూబర్ సంజూ టెకీపై కేసు నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: కారులో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి ప్రమాదకర నిర్లక్ష్యం ప్రదర్శించిన కేరళ యూట్యూబర్ సంజూ టెకీపై కేసు నమోదైంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు అతడి లైసెన్స్ ను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. కారు రిజిస్ట్రేషన్ ను కూడా రద్దు చేశారు. అతడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
పోలీసులు కథనం ప్రకారం, ఇటీవల విడుదలైన ఆవేశం సినిమాలోని సన్నివేశాన్ని సంజూ తన వాహనంలో రీక్రియేట్ చేద్దామనుకున్నాడు. ఇందుకోసం కారులో ప్లాస్టిక్ కవర్లతో తాత్కాలికంగా ఓ స్వమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశాడు. అందులో కూర్చుని కొబ్బరి నీళ్లు తాగుతూ ఊరంతా తిరిగాడు.
Viral: ఎండ నుంచి బిడ్డను కాపాడేందుకు పావురాయి ప్రాణత్యాగం.. వైరల్ వీడియో!
ఈ క్రమంలో కారులోకి నీరు లీకైంది. చివరకు కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి. దీంతో, కంగారు పడ్డ వారు నీటిని బయటకు వదిలేశారు. ఆ తరువాత ఈ వీడియో నెట్టింట పోస్ట్ చేశారు. ఇది పోలీసుల దాకా వెళ్లడంతో మోటార్ వాహనాల నిబంధనలు ఉల్లంఘించినందుకు యూట్యూబర్‌పై చర్యలు తీసుకున్నారు. అళపుజ మెడికల్ కాలేజీలోని రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేయాలని కూడా ఆదేశించారు.
Updated Date - May 30 , 2024 | 10:38 PM