Kevin Pietersen: లక్నో ఎయిర్‌పోర్టులో కొత్త టర్మినల్ చూసి మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఫిదా!
ABN, Publish Date - Apr 29 , 2024 | 08:25 PM
లక్నో ఎయిర్‌పోర్టులో కొత్తగా నిర్మించిన టర్మినల్‌ను చూసి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అబ్బురపడ్డాడు. అత్యాధునిక డిజైన్‌తో నిర్మించిన ఈ టర్మి నల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: లక్నో ఎయిర్‌పోర్టులో కొత్తగా నిర్మించిన టర్మినల్‌ను (Lucknow International Airport) చూసి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) అబ్బురపడ్డాడు. అత్యాధునిక డిజైన్‌తో నిర్మించిన ఈ టర్మినల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. టర్మినల్‌ను ఇంత బాగా డిజైన్ చేసిన వారిని చూసి యూపీ ముఖ్యమంత్రి గర్వంగా ఫీలవుతుంటారని కామెంట్ చేశాడు. ఈ మేరకు ఆదివారం కొత్త టర్మినల్ ఫొటోను పీటర్సన్ నెట్టింట పంచుకున్నాడు. ఇది ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.
కొత్త టర్మినల్‌లో స్ట్రీట్ ఆఫ్ ఫ్లవర్స్ పేరిట ఏర్పాటు చేసిన నడవా తనకు బాగా నచ్చిందని పీటర్సన్ అన్నాడు. అత్యద్భుత రాష్ట్రాలలో ఒకటైన యూపీ పనితీరు గొప్పగా ఉందని ప్రశంసించాడు. ఇది ప్రపంచస్థాయి నిర్మాణమని కొనియాడాడు.
Viral: భారతీయుల్ని ఫాలో అవుతున్న బ్రిటన్ కంపెనీ.. ఆనంద్ మహీంద్రా ఫుల్ ఖుష్!
పీటర్సన్ కామెంట్‌పై నెట్టింట అనేక మంది స్పందించారు. అత్యాధునిక వసతులు సంతరించుకుంటున్న లక్నో ఎయిర్‌పోర్టు యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోందని కొందరు కామెంట్ చేశారు. ఇది కొత్త ఇండియా, మెరుగైన ఇండియా అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. పీటర్సన్ కామెంట్‌పై లక్నో డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా స్పందించింది. పీటర్సన్‌కు ధన్యవాదాలు తెలిపింది.
ప్రస్తుతం ఐపీఎల్‌లో భాగంగా క్రికెట్ వ్యాఖ్యాతగా పీటర్సన్ దేశంలో పర్యటిస్తున్నాడు. స్థానిక వంటకాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఢిల్లీలో ఛోలే బటోరేను ఎంజాయ్ చేశాడు. ‘‘ఈ ఫుడ్ ఎంటో చెప్పుకోండి చూద్దాం. ఢిల్లీ వాసులకు ఇది చాలా ఫేవరెట్’’ అంటూ ఛోలే బటోరే ఫొటోను షేర్ చేశాడు. తొలుత లక్నో మ్యాచ్‌కు వెళ్లిన అతడు అక్కడి ఎయిర్‌పోర్టు డిజైన్ చూసి ముగ్ధుడయ్యాడు. ఆ తరువాత బెంగళూరు ఎయిర్‌పోర్టు కూడా వరల్డ్ క్లాస్ అంటూ కితాబునిచ్చాడు.
Updated Date - Apr 29 , 2024 | 08:45 PM