ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోడిపుంజు హోటల్‌

ABN, Publish Date - Nov 24 , 2024 | 07:29 AM

ఎత్తయిన హోటల్‌, విశాలమైన హోటల్‌, అత్యంత ఖరీదైన హోటల్‌ గురించి ఇప్పటిదాకా విని ఉంటారు. అయితే ప్రపంచంలో కోడిపుంజు ఆకారంలో ఉన్న హోటల్‌ ఇదొక్కటే. ఫిలిప్పీన్స్‌లో ఉన్న ఈ వినూత్న హోటల్‌ ఇటీవలే గిన్నిస్‌ రికార్డులకెక్కి, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఎత్తయిన హోటల్‌, విశాలమైన హోటల్‌, అత్యంత ఖరీదైన హోటల్‌ గురించి ఇప్పటిదాకా విని ఉంటారు. అయితే ప్రపంచంలో కోడిపుంజు ఆకారంలో ఉన్న హోటల్‌ ఇదొక్కటే. ఫిలిప్పీన్స్‌లో ఉన్న ఈ వినూత్న హోటల్‌ ఇటీవలే గిన్నిస్‌ రికార్డులకెక్కి, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఫిలిప్పీన్స్‌లో స నెగ్రోస్‌ అక్సిడెంటల్‌ అనే ప్రాంతంలో కొండల మధ్య, పచ్చని ప్రకృతి ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. అక్కడే ఒక భారీ కోడిపుంజు మిద్దె మీదికి ఎక్కినట్టు కనిపిస్తుంది. అదే ‘కంప్యుస్టోహన్‌ హైలాండ్‌ రిసార్ట్‌’... ఉరఫ్‌ ‘చికెన్‌ హోటల్‌’.


ఏంటీ హోటల్‌ కథ..

చాలామందికి ఎత్తయిన హోటల్‌ లేదా వినూత్నమైన ఆకారంలో బిల్డింగ్‌ను కట్టాలనే కోరిక ఉంటుంది. అయితే ఫిలిప్పీన్స్‌లోని రికార్డో అనే పెద్దాయన కాస్త వినూత్నంగా ఆలోచించారు. 2010లో రికార్డో తన కుటుంబంతో ఈ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి ఎత్తయిన కొండల్లో వీచే పిల్లగాలికి ఫిదా అయ్యారు. ఈ స్థలాన్ని రికార్డో తన భార్య నితా పేరు మీద కొన్నాడు. రోడ్ల నిర్మాణం జరిగి, విద్యుత్‌ లైన్లు వచ్చాక ఆ ప్రాంతంలో రాకపోకలు పెరిగాయి. దాంతో రిసార్ట్‌ నిర్మాణానికి అంకురార్పణ చేశాడు. అంతకుముందు ఈ దంపతులు ఇంట్లో కోళ్లను పెంచేవారు. వాటిని భార్యభర్తలిద్దరూ ప్రేమగా, కన్నబిడ్డల్లా సాకేవారు.


ఆ ఇష్టాన్ని తమ రిసార్టులో ప్రతిబింబించాలని భావించారు. ‘‘నేను ఫిలిప్పీన్స్‌లోని మారుమూల గ్రామంలో పుట్టాను. కడు పేదరికంలో బతికా. చిన్నప్పుడు చేతిలో డబ్బుల్లేక బూట్లు పాలిష్‌ చేసి.. బడికెళ్లి చదువుకునేవాడిని. పైసా పైసా కూడబెట్టుకునేవాణ్ని. ఇక్కడికొచ్చాక నా భార్య నేను కోళ్లను పెంచుకునేవాళ్లం. వాటిపై ప్రేమతోనే భారీ కోడిపుంజు ఆకారాన్ని రిసార్టులో ఉంచాలనుకున్నాం. మిద్దె మీద కోడిపుంజు కలను నెరవేర్చుకున్నాం. అయితే ఇంత భారీ కోడిపుంజు నిర్మాణం ప్రపంచంలోనే ఎక్కడ లేదని తెలిసింది. అది కాస్త గిన్నిస్‌ రికార్డులో చోటు సంపాదించటం గర్వంగా ఉంది’ అని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రిసార్ట్‌ యజమాని రికార్డో.


ఈ కోడిపుంజు నిర్మాణం 34 మీటర్లు ఎత్తు, 39 మీటర్లు వెడల్పు ఉంటుంది. ఈ హోటల్‌లో 15 విశాలవంతమైన ఆధునిక ఏసీ గదులున్నాయి. ప్రతీ గదిలో టీవీ సెట్‌ దగ్గర కోడి బొమ్మలను అలంకరణగా ఉంచారు. గది తలుపులకు కూడా కోడిపుంజు బొమ్మ ఉంటుంది. ఇలా మొత్తానికి కోడిపుంజు బ్రాండ్‌గా మారింది. ‘చికెన్‌ హాటల్‌’ రిసార్టులో మూడు స్విమ్మింగ్‌ పూల్స్‌, వాటర్‌గేమ్స్‌ కోసం కృత్రిమంగా సృష్టించిన నీళ్ల మడుగు కూడా ఉంది. రిసార్ట్‌ మొత్తం రకరకాల బొమ్మలతో డిస్నీ వరల్డ్‌లా పిల్లలను, పెద్దలను ఆకట్టుకుంటుంది. సాయంత్రం పూట చల్లని వాతావరణంలో బయట కూర్చోవటానికి


చిన్నచిన్న పాకల్లాంటివి కూడా ఉన్నాయి. మొత్తానికి చికెన్‌ హోటల్‌లో సేదదీరుతున్నవారికే కాదు... ఆ మార్గంలో ప్రయాణిస్తున్నవారికి కూడా ఈ భారీ ఆకారం సెల్ఫీపాయింట్‌గా మారింది.

- భారీ చికెన్‌ హోటల్‌ నిర్మాణాన్ని గత యేడాది జూన్‌లో ప్రారంభించారు. ఈ యేడాది సెప్టెంబరు 8న పూర్తయ్యింది.

- రిసార్ట్‌ యజమాని రికార్డో బాల్యంలో కోడిపుంజులు కొట్లాడుతుంటే ఆసక్తిగా చూసేవాడట. వాటిపై ఉన్న ప్రేమతో పౌలీ్ట్ర రంగానికి ఈ హోటల్‌ను అంకితం ఇచ్చారు.

- మౌనంగా ఉన్నా బలంగా ఉండాలనే సందేశాన్ని ఆయన ఈ హోటల్‌ ద్వారా అందిస్తున్నారు. సోషల్‌ మీడియాలో దీని గురించి వైరల్‌ కావడంతో ఇప్పుడిప్పుడే విదేశీయులు సందర్శించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

Updated Date - Nov 24 , 2024 | 07:29 AM