ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: తొలిసారి గులాబ్ జామూన్ ట్రై చేసిన కొరియా యువతి! ఆమె రియాక్షన్ చూస్తే..

ABN, Publish Date - Nov 25 , 2024 | 10:30 PM

భారత్‌కు వచ్చిన ఓ కొరియా యువతి తొలిసారి గులాబ్ జామూన్ రుచి చూసిన మైమరిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: విభిన్న సంస్కృతుల వారిని ఒక్క తాటిపైకి తెచ్చే అంశాల్లో ఫుడ్ ముందుంటుందని చెప్పక తప్పదు. అయితే, రవాణా సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన నేటి కాలంలో అనేక మంది కొత్త ప్రాంతాలకు వెళుతూ అక్కడి ఫుడ్స్‌ను రుచి చూస్తున్నారు. తమ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ కొత్త వారికి కూడా ఈ రుచులను పరిచయం చేస్తున్నారు. కుదిరితే ఆయా ప్రాంతాలకు వెళ్లి వాటిని ట్రై చేయాలని కూడా సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు వచ్చిన ఓ కొరియా యువతి తొలిసారి గులాబ్ జామూన్ రుచి చూసిన మైమరిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది (Viral).

Viral: వరుడు కావాలంటూ మెడలో బోర్డు వేలాడేసుకుని హోటల్ ముందు నిలబడ్డ యువతి!


కెల్లీ కొరియా అనే యువతి కొంతకాలంగా మహారాష్ట్రలోని ముంబైలో ఉంటోంది. ఇటీవల ఆమె స్థానికుల సూచన మేరకు గులాబ్ జామూన్ ట్రై చేసింది. చిక్కటి పానకంలో కనిపిస్తున్న గులాబ్ జామూన్‌లను చూడగానే తొలుత ఆమెకు ఏమీ అర్థం కాలేదు. వాటిని ఎలా తినాలో తెలీక తికమక పడింది. ఈలోపు పక్కనున్న వారు వివరణ ఇచ్చాడు. గులాబ్ జామూన్‌ను చిన్న ముక్క చేసి తినాలని సూచించారు. వారు చెప్పినట్టు చిన్న ముక్కను నోట్లో పెట్టుకోగానే ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. మెత్తగా, క్రీమీగా ఉన్నాయంటూ మురిసిపోయింది. ఇది నాకు చాలా నచ్చింది. భోజనం తరువాత ఇండియన్స్ తినే స్వీట్ ఇదేనా అని ప్రశ్నించింది. నాకు గులాబ్ జామూన్ అంటే ఇష్టం అనే పోస్టుతో ఈ వీడియోను షేర్ చేసింది.

Viral: త్రేన్పులు రాని, అపానవాయువు వదలని వరుడు కావాలంటూ పేపర్లో యాడ్!


ఇక వీడియోలో యువతి రియాక్షన్ జనాలకు నచ్చడంతో ఇది తెగ వైరల్‌గా మారింది. గులాబ్ జామూన్ ఒకసారి టేస్ట్ చేస్తే ఇక మళ్లీ వదిలిపెట్టరంటూ కొందరు కామెంట్ చేశారు. యువతి రియాక్షన్ అద్భుతంగా ఉందని కూడా అన్నారు.

ఇదిలా ఉంటే, ఇటీవల ఓ అమెరికన్ మహిళ తన ముగ్గురు పసిపిల్లలకు ఇండియన్ ఫుడ్స్ అంటే తెగ ఇష్టమంటూ షేర్ చేసిన ఓ వీడియో కూడా నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ఒక చిన్నారి ఆలూ పరాఠా, మరో చిన్నారి పప్పన్నం, మూడో చిన్నారి పోహా తింటుండగా తీసిన వీడియోను ఆమె నెట్టింట షేర్ చేసింది. మసాలా దోస కూడా ఇష్టమని చెప్పింది. ఈ వీడియో కూడా వైరల్ కావడంతో ఏకంగా 11 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి.

Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..

Read Latest and Viral News

Updated Date - Nov 25 , 2024 | 10:40 PM