ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: హోటల్ లాబీలో మూత్రవిసర్జన చేశాడని ఊస్టింగ్! కోర్టుకెక్కిన ఉద్యోగి!

ABN, Publish Date - Aug 26 , 2024 | 09:53 PM

లెనోవో సంస్థకు చెందిన ఓ ఉద్యోగి హోటల్‌ లాబీలో మూత్ర విసర్జన చేసినందుకు ఉద్వాసనకు గురయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేసిన తనను ఉద్యోగంలోంచి తీసేసినందుకు సదరు ఉద్యోగికి కోర్టుకెక్కాడు. సంస్థ నుంచి రూ.12 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: లెనోవో సంస్థకు చెందిన ఓ ఉద్యోగి హోటల్‌ లాబీలో మూత్ర విసర్జన చేసినందుకు ఉద్వాసనకు గురయ్యాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేసిన తనను ఉద్యోగంలోంచి తీసేసినందుకు సదరు ఉద్యోగికి కోర్టుకెక్కాడు. సంస్థ నుంచి రూ.12 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం స్థానికంగా సంచలనం (Viral) రేపుతోంది.

Viral: చోరీకొచ్చి పురాణం చదువుతూ లోకం మర్చిపోయిన దొంగ.. చివరకు..


పూర్తి వివరాల్లోకి వెళితే, రిచర్డ్ బెకర్ అనే వ్యక్తి అమెరికాలోని లెనోవో సంస్థలో పనిచేస్తున్నాడు. ఫిబ్రవరిలో న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో దిగిన ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో లాబీకి ఆనుకుని ఉన్న ఓ స్థలంలో మూత్రవిసర్జన చేశాడు. ఇది సహోద్యోగి కంటపడటంతో అతడు హెచ్‌ఆర్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. దీంతో, రిచర్డ్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

అయితే, సంస్థ తన విషయంలో అన్యాయంగా వ్యవహరించిందంటూ రిచర్డ్ కేసు దాఖలు చేశాడు. సంస్థ నుంచి రూ. 12 కోట్ల పరిహారం డిమాండ్ చేశాడు. న్యూయార్క్ రాష్ట్ర మానవహక్కుల చట్టాలను ఉల్లంఘిస్తూ సంస్థ తనను ఉద్యోగం నుంచి తొలగించిందని రిచర్డ్ ఆరోపించాడు. తాను మూత్రాశయానికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నానని, చికిత్స కూడా తీసుకుంటున్నానని అతడు చెప్పుకొచ్చాడు. విధిలేని పరిస్థితుల్లో తాను లాబీలో మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిందని చెప్పాడు. తన అనారోగ్యం విషయం సంస్థలోని సీనియర్ ఉద్యోగులు, ఇతర ఉన్నతాధికారులకూ తెలుసని అన్నాడు. 2016 నుంచి తానీ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపాడు.


‘‘చట్ట పరంగా నడుచుకోవడం అటుంచితే సంస్థ నాపై కనీసం మానవత్వం కూడా ప్రదర్శించలేదు. విషయం తెలిసిన రోజుల వ్యవధిలోనే తొలగించారు. ఓ ఫేక్ హెచ్ ఆర్ దర్యాప్తు తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలగించే ముందు నన్ను కనీసం సంప్రదించను కూడా లేదు’’ అని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, లెనోవో మాత్రం ఈ ఉదంతంపై ఇంకా స్పందించాల్సి ఉంది.

Read Viral and Telugu News

Updated Date - Aug 26 , 2024 | 09:58 PM

Advertising
Advertising
<