ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఊహించని రీతిలో చిరుత సాహసం! ప్రాణాలకు తెగించి మరీ.. షాకింగ్ వీడియో

ABN, Publish Date - Oct 26 , 2024 | 08:26 PM

తన బిడ్డలను కాపాడుకునేందుకు ఓ తల్లి చిరుత సింహంతో ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనం రేపుతోంది. తనకు రెండింతలు భారీగా ఉన్న సింహంతో పోరాడిన వైనం చూసి జనాలు నివ్వెరపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: తన బిడ్డలను కాపాడుకునేందుకు ఓ తల్లి చిరుత సింహంతో ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనం రేపుతోంది. తనకు రెండింతలు భారీగా ఉన్న సింహంతో పోరాడిన వైనం చూసి జనాలు నివ్వెరపోతున్నారు. ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఈ సన్నివేశం ఆవిష్కృతమైంది (Viral).

గ్రుమెటీ సెరెంగెటీ సఫారీపై బయలుదేరిన బాబ్, కెరోల్‌లు ఈ షాకింగ్ దృశ్యాలను తమ కెమెరాలో బంధించి నెట్టింట షేర్ చేశారు. నిస్వార్థంతో కూడిన ఇంతటి సాహసం తామెప్పుడూ చూడలేదని అన్నారు.

Viral: దీపావళి రోజున ఇంట్లో ఒంటరిగా మహిళ! ఇంతలో ఊహించని విధంగా..


ఆ రోజు ఉదయాన్నే వారు మరికొందరు పర్యాటకులతో కలిసి సఫారీపై బయలుదేరారు. ఓ చిరుత తన పిల్లలతో కలిసి అక్కడే ఉన్నట్టు గైడ్ చెప్పడంతో అందరిలో ఉత్సాహం పెరిగిపోయింది. ఇంతలో వారందరూ ఆశ్చర్యపోయేలా ఓ చిరుత, దాని పిల్లలు గుహ పక్కన కనిపించాయి. ఈ దృశ్యం చూసి అబ్బురపడ్డ పర్యాటకులు ఆ మరుక్షణమే చిరుత ఆందోళన చెందుతున్న వైనాన్ని గుర్తించారు.

అకారణంగా చిరుత టెన్షన్‌లో ఉందని వారు అనుకుంటున్న తరుణంలో వారికి కొద్ది దూరంలో ఓ ఆడ సింహం కూడా కనిపించింది. అయితే, దాని దృష్టి సమీపంలోని దుప్పుల మందపై ఉందని పర్యాటకులు అనుకున్నారు. కానీ సింహం వ్యూహాత్మకంగా అలా చేస్తున్న విషయం వారికి కాసేపటికి అర్థమై ఆశ్చర్యపోయారు. ఈ లోపు సింహం మెల్లమెల్లగా గుహవైపు అడుగులు వేసింది.

Oxford University: బ్రిటన్‌‌లో ఎన్నారై మహిళకు షాక్! పీహెచ్‌డీ కోసం రూ.కోటి ఖర్చు పెడితే..


అది గుహ వద్దకు వస్తే తన బిడ్డలు బతకడం కష్టమని అప్పటికే ఓ అంచనాకు వచ్చిన చిరుత ప్రాణాలకు తెగించి మరీ సింహం మీదకు దాడికి దిగింది. దానితో భీకరంగా పోరాడింది. సింహం దాడి నుంచి తప్పించుకుంటూనే దానికాలిపై బలంగా కొరికింది. ఆ దెబ్బకు సింహం అక్కడి నుంచి పారిపోయింది.

వాస్తవానికి ఆడ సింహానికి కొద్ది దూరంలోనే ఇతర సింహాలు కూడా కాపుకాశాయి. అవన్నీ కలిసి దాడి చేసి ఉంటే చిరుతతో పాటు దాని కూనలు కూడా కన్నుమూసేవి. కానీ ఆడ సింహం ఇతర సింహాలను సాయానికి పిలవకుండానే చిరుతపై దాడికి దూకింది. చిరుత ఏం చేయలేదన్న ధైర్యంతో రంగంలోకి దిగింది. కానీ పిల్లలపై మమకారం ఇచ్చిన శక్తితో చిరుత భీకర దాడి చేసి సింహం పలాయనం చిత్తగించేలా చేసింది. అయితే, అప్పటికీ పట్టువదిలిపెట్టని ఆడ సింహం తన మందను ఇటువైపు పిలిచే క్రమంలోనే ఓ దుప్పి వాటి కంట పడింది. దీంతో, చిరుతను అటాక్ చేయాలన్న ఆలోచన మాని సింహాల గుంపు ఆ దుప్పి ఉన్న దిశగా వెళ్లిపోయాయి. ఈలోపు చిరుత తన కూనలను మరో సురక్షిత ప్రాంతానికి తరలించింది.

Read Latest and Travel News

Updated Date - Oct 26 , 2024 | 10:26 PM