ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఈ పిల్ల సింహం నిజంగా లక్కీ! ఒక్కసారిగా అడవి దున్నల గుంపు దాడి చేస్తే..

ABN, Publish Date - Jul 23 , 2024 | 03:32 PM

అడవి దున్నల మంద నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డ ఓ పిల్ల సింహం వీడియో వైరల్ గా మారింది. సింహం చాలా లక్కీ అంటూ వీడియో చూసిన నెటిజన్లందరూ కామెంట్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సింహం మృగరాజే కానీ దానికీ అనేక రకాల అపాయాలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా చిన్నతనంలో, ఆ తరువాత వృద్ధాప్యంలో మగ సింహాలు దారుణ కష్టాల పడతాయి. చిన్న చిన్న జీవులు కూడా వాటిని కసితీరా వేధించి అంతమొందిస్తాయి. ఇక అనేక జంతువులు పిల్ల సింహాలు కనిపిస్తే అస్సలు వదిలిపెట్టవు. వాటిని ఇప్పుడే సులువుగా చంపేస్తే భవిష్యత్తులో ప్రమాదం ఉండదన్న తలంపుతో వెంటాడి మరీ అంతమొందిస్తాయి. తాజాగా ఓ పిల్ల సింహం ఇలాంటి ప్రమాదంలోనే పడింది కానీ అదృష్టం కలిసిరావడంతో వెంట్రుకవాసిలో ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ (Viral) అవుతోంది.

Viral: పదేళ్లుగా వీధుల్లో నివసిస్తున్న మహిళకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్!


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఒంటరిగా ఉన్న ఓ పిల్ల సింహాన్ని అడవిదున్నల గుంపు టార్గెట్ చేసుకుంది. అన్నివైపుల నుంచి దాన్ని అడవిదున్నలు చుట్టుముట్టాయి. దీంతో, పిల్ల సింహం ఓ ఎండిపోయిన చిన్న చెట్టు ఎక్కింది. కానీ దున్నలు మాత్రం వదిలిపెట్టకుండా చెట్టును పదే పదే కుమ్మడంతో అది విరిగి పిల్ల సింహం కిందపడింది. కానీ అడవిదున్నుల మాత్రం చెట్టుపైనే దృష్టిపెట్టడంతో వాటి కంటపడకుండా పిల్ల సింహం తప్పించుకోగలిగింది (Lion cubs narrow escape from buffalo herd in thrilling wildlife encounter).


ఇక వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. పిల్ల సింహం నిజంగా లక్కీ అంటూ కామెంట్ చేశారు. దున్న కొమ్ములకు చిక్కాల్సిన అది అదృష్టవశాత్తూ తప్పించుకుందని కామెంట్ చేశారు. సింహాల జీవితంలో శైశవం, వృద్ధ్యాప్యం అత్యంత కఠినమైన దశలని కొందరు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 03:35 PM

Advertising
Advertising
<